Virat Kohli : భారత క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ దిగ్గజాలే. సుదీర్ఘ కాలంగా జట్టుకు సేవలందిస్తున్న ఈ ఇద్దరూ ఎన్నో అద్భుత విజయాల్లో భాగమయ్యారు. ఒకరి నాయకత్వంలో ఒకరు ఆడుతూ జూనియర్లకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. అంతేకాదు తమమధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు వచ్చిన ప్రతిసారి.. తమ స్నేహంతోనే చెక్ పెట్టారీ లెజెండ్స్.
అభిమానులు ముద్దుగా రో-కోగా పిలుచుకునే ఈ జోడీ.. ఐపీఎల్ 18వ సీజన్లో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఏప్రిల్ 7, సోమవారం ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించాడు. ఆ వీడియోను ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
𝐓𝐡𝐞 𝐑𝐎-𝐊𝐎 𝐛𝐨𝐧𝐝! 🫂
Virat Kohli talks about his equation with Rohit Sharma, and how they’ve bonded over the years and created some wonderful memories! ✨
We’re just a day away from seeing them go up against each other, and we wish them well! 😌👊#PlayBold #ನಮ್ಮRCB… pic.twitter.com/I6GHFHxgEx
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 6, 2025
‘రోహిత్, నేను సుదీర్ఘ కాలం జాతీయ జట్టుకు ఆడుతున్నాం. గత ఏడాది వరకూ మూడు ఫార్మట్లలో కొనసాగిన మేము.. ఎంతో సఖ్యతగా ఉండేవాళ్లం. దేశం తరఫున మైదానంలోకి కలిసి దిగిన ప్రతిసారి ఇద్దరం ఆటను ఆస్వాదించాం. నిజం చెప్పాలంటే రోహిత్‌తో ఆడడం, టీ20 వరల్డ్ కప్ గెలుపొందడం, ఛాంపియన్స్ ట్రోఫీని అందుకోవడం నాకు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ జ్ఞాపకాలు నాతో ఎల్లప్పుడూ ఉంటాయి. పొట్టి వరల్డ్ కప్ ఛాంపియన్లుగా స్వదేశం వచ్చాక.. బస్ పరేడ్‌లో రోహిత్, నేను ట్రోఫీని పట్టుకొని అభిమానులకు అభివాదం చేయడం మర్చిపోలేను’ అని కోహ్లీ తెలిపాడు.
An Era Comes To An End in T20Is! 😢
The Aura Will Stay Forever! ☺️
2️⃣ Legends of the game 🙌
45 🤝 18
Thank you, Rohit Sharma and Virat Kohli 🫡 🫡#T20WorldCup | #TeamIndia | #SAvIND | @ImRo45 | @imVkohli pic.twitter.com/SD7wCmofZO
— BCCI (@BCCI) June 30, 2024
రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలుపొంది ట్టు టీ20 వరల్డ్ కప్‌ను అందుకుంది. సఫారీలపై విజయంలో కోహ్లీ 75 పరుగుల ఇన్నింగ్స్ది కీలక పాత్ర. అయితే.. ఆ విజయోత్సాహంలోనే ముందుగా విరాట్.. పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలకాడు. అతడిని అనుసరించిన రోహిత్ తాను కూడా టీ20ల నుంచి వైదొలుగుతున్నాని చెప్పాడు.