IPL 2025 : సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తారనుకుంటే మళ్లీ నిరాశపరిచారు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ నిలకడ లేమిని కొనసాగించింది టాపార్డర్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే గుజరాత్ టైటన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్(4-17) ఆరెంజ్ ఆర్మీకి పెద్ద షాకిచ్చాడు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్(8), అభిషేక్ శర్మ(18)లను పెవిలియన్ పంపాడు. 50 పరుగులకే 3 వికెట్లు పడిన దశలో నితీశ్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27)లు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో అనికేత్ వర్మ(18), కెప్టెన్ ప్యాట్ కమిన్స్(22 నాటౌట్) మెరుపులతో జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించారు. నిర్ణీత ఓవర్లలో ఆరెంజ్ ఆర్మీ 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేయగలిగింది.
టాస్ గెలుపొందిన సన్‌రైజర్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డేంజరస్ ట్రావిస్ హెడ్(8)ను లెగ్త్ బాల్ వేసి ఔట్ చేశాడు సిరాజ్. సాయి సుదర్శన్ చక్కని క్యాచ్ పట్టడంతో హెడ్ పెవిలియన్ చేరాడు. 9 పరుగులకే వికెట్ పడినా.. ఓపెనర్ అభిషేక్ శర్మ(18) దూకుడుగా ఆడాడు. ఇషాంత్, సిరాజ్ బౌలింగ్‌లో రెండేసి బౌండరీలతో ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ, సిరాజ్ వేసిన మూడో ఓవర్లో తెవాటియాకు సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నితీశ్ కుమార్ రెడ్డి(31), హెన్రిచ్ క్లాసెన్(27)లు.. నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారీ షాట్లు ఆడేస్తున్న వీళ్లను సాయి కిశోర్(2-24) ఔట్ చేసి హైదరాబాద్ కష్టాలను మరింత పెంచాడు.
4️⃣/1️⃣7️⃣ – Best bowling figures ✅
1️⃣0️⃣0️⃣ #TATAIPL wickets ✅A sweet homecoming for Mohd. Siraj as he rattles #SRH with a sensational spell! 🔥
Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @mdsirajofficial pic.twitter.com/cupAsMF0a2
— IndianPremierLeague (@IPL) April 6, 2025
నితీశ్ ఐదో వికెట్‌గా వెనుదిరిగే సరికి సన్‌రైజర్స్ స్కోర్ 105. మరో నాలుగు ఓవర్లే ఉండడంతో స్కోర్ 130 దాటడమే కష్టం అనిపించింది. కానీ, ప్రసిద్ వేసిన 17వ ఓవర్లో అనికేత్ వర్మ(18) లాంగాన్, సిల్లీ పాయింట్ దిశగా బౌండరీలు బాది జోరు పెంచాడు. ఆఖరి బంతికి కమింద్ మెండిస్(1) ఫైన్ లెగ్‌లో భారీ షాట్ ఆడి సుదర్శన్ చేతికి చిక్కాడు.
ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(22 నాటౌట్) బౌండరీ బాదాడు. అయితే.. సిరాజ్ 19వ ఓవర్లో అనికేత్‌ను ఎల్బీగా, ఇంప్యాక్ట్ ప్లేయర్ సిమర్జిత్ సింగ్(0)ను బౌల్డ్ చేసి నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇషాంత్ వేసిన ఆఖరి ఓవర్లో కమిన్స్ 4, 6 బాదగా.. షమీ(6 నాటౌట్) ఫోర్ కొట్టడంతో జట్టు స్కోర్ 150కి చేరింది. దాంతో, హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.