Sreeleela | యంగ్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. షూటింగ్‌కి వెళ్లి తిరిగి వస్తున్న వస్తున్న హీరోయిన్‌తో పలువురు అభిమానులు అనుచితంగా వ్యవహరించారు. సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీలీల త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. కార్తీక్ ఆర్యన్ హీరోగా అనురాగ్ బసు దర్శకత్వంలో వస్తున్న ఓ ప్రేమకథా చిత్రంలో శ్రీలీల నటిస్తున్నది. ఈ మూవీ షూటింగ్‌కు కోసం చిత్ర యూనిట్ డార్జిలింగ్‌కు వెళ్లింది. షూటింగ్ అనంతరం కార్తీక్ ఆర్యన్‌తో కలిసి వస్తున్న సమయంలో అభిమానులు గుమిగూడారు.
కార్తీక్ ఆర్యన్ అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లిపోయాడు. శ్రీలీల సైతం నవ్వుతూ అతని వెనుకాలే వస్తున్న సమయంలో గుంపులోని కొందరు పోకిరీలు శ్రీలీల చేయి పట్టుకుని లాగారు. దాంతో ఒక్కసారి శ్రీలీల షాక్‌కు గురైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది శ్రీలీలను వారి నుంచి కాపాడి సురక్షితంగా తీసుకువెళ్లారు. ఈ సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు హీరోయిన్‌కు మద్దతుగా నిలిచారు. సెలబ్రిటీలకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుందని, అభిమానం హద్దుమీరొద్దని.. ఆకతాయిలను దూరం పెట్టాలని సూచిస్తున్నారు.
Actress #Sreeleela mobbed by fans.pic.twitter.com/XAiBvPOsq6
— SR (@SR_India67) April 6, 2025