మూసాపేట, ఏప్రిల్ 06 : సనాతన ధర్మానికి ప్రతిరూపమే భారతదేశం అని అంబుత్రాయ పీఠాధిపతి శ్రీ శ్రీ ఆదిత్య పర శ్రీ స్వామీజీ చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ముసాపేట మండలంలోని తుంకినిపూర్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వామీజీతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. సాక్షాత్తు పరిష్కారమని అవతారమే శివాజీ అని చెప్పారని అన్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు గ్రామానికి పట్టిన దరిద్రం మొత్తం పోయిందని చెప్పారు. దైవ కార్యక్రమాల్లో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరు ఎదుటి వారిని గౌరవించి మన గౌరవాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు. అలాంటి స్వామీజీలకు పార్టీలకు ఎలాంటి సంబంధం వల్ల ఉండవని హిందుత్వాన్ని కాపాడాలని తపనతోనే ఉంటామన్నారు. ప్రజలు కూడా ఆ దిశగా పార్టీలకు అతీతంగా హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తోటి వారికి సహాయం చేస్తూ మంచి సమాజాన్ని నిర్మించాలని ఆయన కోరారు. అనంతరం విగ్రహావిష్కరణ చేశారు.