Team India : సుదీర్ఘ ఫార్మాట్లో భారత జట్టు అరుదైన ఘనత సాధించింది. చెపాక్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించి అత్యధికంగా 179 విజయాలతో అదరహో అనిపించింది. 280 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రోహిత్ శర్మ బృందం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) పట్టికలో అగ్రస్థానం కాపాడుకుంది. మరో విషయం ఏంటంటే.. ప్రస్తుతం జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ (Virat Kohli), ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin)లు దేశం తరఫున ఎక్కువ టెస్టు విజయాలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించారు.
భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ అత్యధిక టెస్టు విజయాల్లో భాగమైనవాళ్లలో కోహ్లీ, అశ్విన్‌లది రెండో స్థానం. వీళ్లిద్దరూ 60 మ్యాచుల్లో విజయాన్ని చవి చూశారు. ఇక ఈ జాబితాలో టాప్‌లో ఉన్నది ఎవరంటే.. దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar). తన బ్యాటింగ్ విన్యాసాలతో ఫ్యాన్స్‌ను అలరించిన సచిన్ టీమిండియా గెలుపొందిన 72 టెస్టుల్లో సభ్యుడు.
వీవీఎస్ లక్ష్మణ్, ద్రవిడ్
నయావాల్‌గా పేరొందని ఛతేశ్వర్ పూజారా (Chateshwar Pujara) 58 విజయాల్లో భాగం కాగా.. వాల్‌గా కీర్తి గడించిన రాహుల్ ద్రవిడ్ (56 విక్టరీలు) నాలుగో స్థానంలో ఉన్నాడు. పేసర్ ఇషాంత్ శర్మ 48, మాజీ సొగసరి ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) 47 టెస్టు విజయాల్లో భాగమయ్యారు.
చెపాక్‌లో బంగ్లాదేశ్‌పై భారీ తేడాతో గెలుపొందిన భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక విజయాలతో చరిత్ర సృష్టించింది. 92 ఏండ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో 580 టెస్టులు ఆడిన టీమిండియా తొలిసారి ఓటముల కంటే విజయాల సంఖ్య పెరిగింది. 580 టెస్టుల్లో 179 విజయాలు సాధించగా.. 178 ఓటములు ఎదురయ్యాయి. 222 మ్యాచ్‌లు డ్రా కాగా ఒక మ్యాచ్ టై అయింది. ప్రపంచ టెస్టు క్రికెట్లోఅపజయాల కంటే విజయాలు సంఖ్య ఎక్కువ ఉన్న దేశాలలో భారత్‌ది నాలుగో స్థానం.
Victory by 2⃣8⃣0⃣ runs in the 1st Test in Chennai 🙌#TeamIndia take a 1⃣-0⃣ lead in the series 👏👏
Scorecard ▶️ https://t.co/jV4wK7BOKA #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/wVzxMf0TtV
— BCCI (@BCCI) September 22, 2024