WhatsApp Update | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. తాజాగా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్తగా సరికొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను తీసుకరాబోతున్నది. దాంతో యూజర్లకు మరింత భద్రత పెరగనున్నది. వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వినియోగిస్తున్నారు. వారిని ఆకట్టుకునేందుకు మెటా యాజమాన్యంలోని కంపెనీ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ని తీసుకువస్తుంది. అదే సమయంలోనూ భద్రతకు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వాస్తవానికి మనకు తెలిసిన వారితో పాటు తెలియనివారి నుంచి సైతం సందేశాలు వస్తుంటాయి. అయితే, తెలియనివారి అకౌంట్స్‌ని బ్లాక్ చేసేలా వాట్సాప్ ఫీచర్‌ని తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ‘బ్లాక్ మెసేజెస్ ఫ్రమ్ అన్నౌన్ అకౌంట్స్’ అనే ఆప్షన్‌తో రానున్నది. వాట్సాప్ ఈ కొత్త ఫీచర్‌ని ఆండ్రాయిడ్ వాట్సాప్ బీటా 2.24.20.16 వెర్షన్లో అందులోకి తెచ్చింది.
త్వరలోనే వాట్సాప్ ఈ ఫీచర్‌ను మిగతా అన్ని వెర్షన్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ ఫీచర్ వాట్సాప్ సెట్టింగ్‌లో ఉన్న అడ్వాన్స్డ్ సెట్టింగ్ ట్యాబ్‌లో కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడానికి పక్కనే కనిపించే టోగుల్‌ని ఆన్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ఐపీ ప్రొటెక్షన్ ఫీచర్‌పై కనిపిస్తుంది. దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత.. తెలియనివారి నుంచి వచ్చే మెసేజెస్ ఆటోమెటిక్‌గా బ్లాక్ అవుతాయి. ప్రస్తుతం బీటా యూజర్లు సైతం ఈ ఫీచర్‌ని వాడుకునేందుకు అవకాశం ఉంది. మీరు బీటా యూజర్లు అయితే, మొదట సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత ప్రైవసీ బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం అడ్వాన్స్డ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఐపీ ప్రొటెక్షన్ ఫీచర్ ఆన్ చేస్తే తెలియని అకౌంట్స్‌ని నుంచి వచ్చే సందేశాలను బ్లాక్ చేసుకోవచ్చు. వాట్సాప్ స్పామ్, స్కామ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ ఫీచర్‌ని తీసుకువస్తున్నది.