Stree 2 Movie | బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘స్త్రీ 2’ మరో కొత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటికే జవాన్ రికార్డును బద్దలుకొట్టి అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన రికార్డును అందుకుంది. ఈ సినిమా తాజాగా రూ. 713 కోట్ల క్లబ్లో ఎంటర్ అయ్యింది. ఇందులో వరల్డ్ వైడ్‌గా రూ.113 కోట్లు రాగా.. కేవలం హిందీలోనే రూ.600 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో ఫస్ట్ టైం రూ.604 కోట్లు దాటిన హిందీ సినిమాగా చరిత్ర సృష్టించింది. అలాగే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో చిత్రంగా ‘స్త్రీ 2’ ఉంది. దీనికంటే ముందు ‘బాహుబలి 2’ మొదటి స్థానంలో ఉండగా.. ‘కేజీయఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కల్కి 2898 ఏడీ’, ‘జవాన్’ వరుస స్థానాలు కైవసం చేసుకున్నాయి. అయితే ‘స్త్రీ 2’ ఇంకా థియేటర్లలో రన్ అవుతుండటంతో ఈ ప్లేస్ మారే అవకాశం ఉంది.
బాలీవుడ్ నటులు రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు అమర్ కౌశిక్ దర్శకత్వం వహించాడు. ఐదేళ్ల కిందట బాలీవుడ్లో వచ్చిన ‘స్త్రీ’ (Stree) చిత్రం సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం పదిహేను కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.180 కోట్ల రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇదే సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాగా ఇది కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ‘స్త్రీ’ సమస్య తొలగిందని చందేరి ప్రజలు ఊపిరి పీల్చుకునేలోగా సర్కటా అనే మరో దెయ్యం వస్తుంది. ఈ రాక్షసుడు మోడ్రన్‌గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు. అయితే దీన్ని అంతమొందించడానికి విక్కీ (రాజ్ కుమార్ రావ్), రుద్ర (పంకజ్ త్రిపాఠి) తో పాటు శ్రద్ధా కపూర్ ఏం చేశారు అనేది ఈ సినిమా స్టోరీ.
Stree 2 inaugurates the ₹600-cr club, becoming the first-ever Hindi film to reach this milestone! 🔥
Thank you for your unwavering love and support! 🫶
Book your tickets now
🔗 – https://t.co/3ELiXoLgQY#Stree2… pic.twitter.com/YRxON2JdsX
— Maddockfilms (@MaddockFilms) September 23, 2024