Ashwin : సొంతగడ్డపై భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతుందంటే ఆ ఇద్దరూ జట్టులో ఉండాల్సిందే. రికార్డులు, గణాంకాలు.. ఏ పరంగా చూసినా సరే వాళ్లలో ఒక్కరినీ తీసెయ్యడానికి వీల్లేదు. ఇప్పటికే మీకు అర్థమై ఉండి ఉంటుంది ఆ జోడీ ఎవరనేది. అవును.. ఆ ఇద్దరూ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin), రవీంద్ర జడేజా (Ravindra Jadeja)లే. చెపాక్ టెస్టు బంగ్లాదేశ్‌పై అశూ, జడ్డూల ద్వయం చిరస్మరణీయ ఆటను అభిమానులు మర్చిపోలేరు.
బ్యాటుతో, బంతితో మ్యాజిక్ చేసి స్పిన్ ఆల్‌రౌండర్లు అనే మాటకు నిలువెత్తు నిదర్శంగా మారింది ఈ స్పిన్ జోడీ. అయితే.. చెపాక్‌లో అద్భుత సెంచరీ.. ఆపై ఆరు వికెట్ల ప్రదర్శన చేసిన అశ్విన్ మ్యాచ్ అనంతరం జడేజా అంటే తనకు ‘అసూయ’ (Jealous) అని చెప్పాడు. అసలు అతడు ఎందుకలా అన్నాడంటే..?
What a partnership between Ashwin and Jadeja. Ashwin getting his 6th test hundred is a very special achievement. @ashwinravi99 @imjadeja pic.twitter.com/brMQWyp9Cg
— Virender Sehwag (@virendersehwag) September 19, 2024
జడేజాతో కలిసి టీమిండియా విజయాల్లో భాగమవుతున్న అశ్విన్ చెపాక్ టెస్టు తర్వాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జడేజా రాకెట్ ఫీల్డర్. మైదానంలో రాకెట్లా వేగంగా కదులుతాడు. నేను అతడిలా చేయలను. అందుకనే అతడంటే నాకు అసూయ. మొత్తంగా అతడంటే విపరీతమైన అభిమానం’ అని అశ్విన్ నవ్వుతూ అన్నాడు. అంతేకాదు జట్టులో చోటు కోసం జడేజాతో పోటీ గురించి కూడా అశూ భాయ్ స్పందించాడు. ‘ఆటలో పోటీ అనేది సాధారణమే. అందులో భాగంగానే ఒకరినొకరు దాటేయాల్సి ఉంటుంది. ఒకవేళ జట్టులో చోటు దక్కినా కూడా మా మధ్య పోటీ ఉంటుంది’ అని తేల్చేశాడు.
𝙏𝙝𝙚 𝙡𝙚𝙜𝙚𝙣𝙙 𝙤𝙛 𝘼𝙨𝙝𝙬𝙞𝙣 𝙖𝙣𝙙 𝙅𝙖𝙙𝙚𝙟𝙖 😎
Are Ravichandran Ashwin and Ravindra Jadeja the greatest spin pair in Test cricket? 🤔 pic.twitter.com/eoiUZd4HqP
— Cricket.com (@weRcricket) September 17, 2024
సుదీర్ఘ ఫార్మాట్లో అశ్విన్, జడేజాల జోడీ సూపర్ హిట్ అయింది. నిరుడు స్వదేశంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సిరీస్.. తాజాగా బంగ్లాదేశ్‌పై వీళ్లిద్దరూ ఆడిన తీరు అమోఘం. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి టాపార్డర్ కుప్పకూలిన చోట అశ్విన్(113), జడేజా(86)లు ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత భుజాన వేసుకున్నారు. బంగ్లా బౌలర్లను విసిగిస్తూ.. స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు.
అశ్విన్ అయితే.. అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థి కెప్టెన్ ఎత్తులను చిత్తు చేశాడు. బౌండరీలతో చెలరేగిన అతడు కెరీర్లో ఆరో టెస్టు శతకం నమోదు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించాడు. జడ్డూ కూడా మూడు కీలక వికెట్లతో ఓ చేయి వేయగా ఇండియా 280 పరుగుల విజయం సాధించి.. రెండు టెస్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మైదానంలో ఆహ్లాదకరమైన పోటీని ఆస్వాదిస్తూనే.. జట్టుకు కష్టమొస్తే ఆపద్భాందవులుగా అవతారమెత్తే అశ్విన్, జడేజాలకు టెస్టుల్లో గొప్ప రికార్డు ఉంది. వీళ్లిద్దరూ ఇప్పటివరకూ 53 టెస్టుల్లో 543 వికెట్లు పడగొట్టారు.
Rohit and Gambhir backed Jadeja over Axar Patel and he delivered with Ashwin
🌟 Jaddu letting his Sword do the talking pic.twitter.com/miicfbOSeD— ICT Fan (@Delphy06) September 19, 2024