Union Budget for Sports : కేంద్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు అగ్రతాంబూలం దక్కింది. గ్రామీణ స్థాయిలో క్రీడల అభివృద్ధికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) భారీ మొత్తాన్ని కేటాయించారు. మంగళవారం లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.900 కోట్లు ఖరారు చేసినట్టు వెల్లడించారు. గత బడ్జెట్ కేటాయింపుతో పోల్చితే ఈసారి రూ.20 కోట్లు అదనంగా మంజూరు చేయడం విశేషం.
ఖేలో ఇండియా కార్యక్రమా(Khelo India)నికి రూ. 900 కోట్లను ఖర్చు చేయనున్నారు. గ్రామీణ, మండల స్థాయిలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ఈ మొత్తాన్ని ఉపయోగించాలనేది కేంద్ర ఉద్దేశం.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ 2024-25కు గనూ రూ.3,442.32 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. రికార్డు స్థాయిలో ఏడోసారి ఆమె బడ్జెట్ను సభ ముందు ఉంచారు. దాంతో, అత్యధికసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన మూడో ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ పేరు రికార్డుపుటల్లో నిలువనుంది. కాంగ్రెస్ హయాంలో పీ. చిదంబరం 9సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు.