Union Budget 2024 | కేరళలో బీజేపీ ఖాతా తెరిచినా రాష్ట్రానికి నిధులు మాత్రం సున్నా : ఆర్ధిక మంత్రి కేఎన్ బాలగోపాల్
Union Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌పై విపక్షం విరుచుకుపడుతోంది. ఏపీ, బిహార్ మినహా మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందని భగ్గమన్నాయి.
Union Budget 2024 : నిర్మలమ్మ బడ్జెట్‌పై విపక్షం విరుచుకుపడుతోంది. ఏపీ, బిహార్ మినహా మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం మొండిచేయి చూపిందని భగ్గమన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేరళలో బీజేపీ ఖాతా తెరిస్తే రాష్ట్రానికి నిధుల వరద పారుతుందని, మేలు జరుగుతుందని కాషాయ నేతలు ఊదరగొట్టినా బడ్జెట్లో రాష్ట్రం ఊసెత్తలేదని కేరళ ఆర్ధిక శాఖ మంత్రి కేఎన్ బాలగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎన్డీయే సంకీర్ణ సర్కార్‌ను బలోపేతం చేసుకునేలా బడ్జెట్‌ను రూపొందించారని దుయ్యబట్టారు. కేరళ రాష్ట్ర రెవిన్యూ వ్యయంలో కేవలం 21 శాతమే పొందుతున్నదని, కొన్ని ఇతర రాష్ట్రాలు 48-49 శాతం పొందుతున్నాయని పేర్కొన్నారు. కేరళకు ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించలేదని అన్నారు. కేరళలో బీజేపీ ఖాతా తెరిచినా రాష్ట్ర ఖాతా మాత్రం మూసివేశారని మండిపడ్డారు. ప్రతి రాష్ట్రం తనకు న్యాయంగా దక్కాల్సిన వాటాను పొందాల్సి ఉందని అన్నారు.
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (Union Budget 2025) సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్మలమ్మ తాత్కాలిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఇక కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇవాళ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
Read More :
Vinod Kumar | మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోసం : వినోద్ కుమార్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

