Vinod Kumar | మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మోసం : వినోద్ కుమార్
Vinod Kumar | కేంద్రంలో నిర్మలా సీతారామన్(Nirmala sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ (Telangana) ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు.
హైదరాబాద్ : కేంద్రంలో నిర్మలా సీతారామన్(Nirmala sitharaman) ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ (Telangana) ఊసేలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి అనుగుణంగా నిధులు కేటాయిస్తానని చెప్పారు. కానీ, అమరావతికి మాత్రమే రూ.15 వేల కోట్లు కేటాయించారని మాజీ ఎంపీ బోయనపల్లి వినోద్ కుమార్(Vinod Kumar) అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై(Central budget) ఆయన స్పందించారు. ఏపీలోని శ్రీకాకుళం చెన్నై కారిడార్ గురించి ప్రస్తావించారు. అదే సమయంలో హైదరాబాద్, నాగ్‌పూర్ కారిడార్‌కు కూడా నిధులు కేటాయిస్తే బాగుండేదన్నారు.
ఉత్తర తెలంగాణ జిల్లా వాసులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం మంచిదే. కానీ, తెలంగాణలోని ప్రాజెలను పట్టించుకోకపోవడం దురదృష్ట కరమన్నారు. ఈ బడ్జెట్ కేవలం చంద్రబాబు, నితీష్ కుమార్‌కు మేలు జరిగేలా ఉందన్నారు. తెలంగాణ నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకనైనా కొట్లాడాలన్నారు. ముఖ్యంగా ఖాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, నవోదయ విద్యాలయాలు ,రైల్వే లైన్లు తదితర విషయాల్లో పట్టుబట్టి బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేలోపు సాధించుకోవాలన్నారు.
మరోసారి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దగా.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరెత్తని నిర్మలా సీతారామన్ గారు.. pic.twitter.com/vMFyynhL0v— B Vinod Kumar (@vinodboianpalli) July 23, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

