Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
Burglars loot jewellery showroom | దొంగలు ఒక జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేశారు. గ్యాస్ కట్టర్‌తో సేఫ్‌లను కట్ చేశారు. రూ. 10 కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలను చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
భోపాల్: దొంగలు ఒక జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేశారు. గ్యాస్ కట్టర్‌తో సేఫ్‌లను కట్ చేశారు. రూ. 10 కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలను చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. (Burglars loot jewellery showroom) మధ్యప్రదేశ్‌లోని కట్నీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొందరు దొంగలు కట్నీ నగరంలోని కృష్ణ జ్యువెలర్స్ షోరూమ్ వెనుక గోడకు రంధ్రం చేశారు. గ్యాస్ సిలిండర్, గ్యాస్ కట్టర్, ఇతర పరికరాలతో లోపలకు ప్రవేశించారు. బంగారు, వజ్రాల ఆభరణాలు భద్రపరిచే సేఫ్‌లను కట్ చేసి తెరిచారు. రూ.10 కోట్లకు పైగా విలువైన బంగారం, వజ్రాల నగలను ఎత్తుకెళ్లారు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ జ్యుయలరీ షోరూమ్‌కు చేరుకుని పరిశీలించారు. ఆ షోరూమ్ నుంచి 265 వేలిముద్రలను సేకరించారు. కొంత దూరంలో దొంగలు వదిలేసిన గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్, ఎల్పీజీ సిలిండర్, స్క్రూడ్రైవర్లు, స్పానర్లు, కొన్ని దుస్తులు, ఖాళీ వాటర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ జ్యుయలరీ షాప్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆరు మందికిపైగా వ్యక్తులు ఈ చోరీలో పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ జ్యుయలరీ షాప్‌ను జూన్‌లో ప్రారంభించినట్లు యజమాని తెలిపారు. దీపావళి పండుగ నేపథ్యంలో మామూలు కన్నా ఎక్కువ ఆభరణాలను అందులో ఉంచినట్లు చెప్పారు. అయితే షోరూమ్‌లో ఉన్న ఆభరణాలన్నింటికీ బీమా ఉన్నదని నగల షాపు యజమాని వివరించారు. ఆ షోరూమ్‌లోని సీసీటీవీలో రికార్డైన చోరీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मध्यप्रदेश के कटनी में किसना डायमंड एंड गोल्ड ज्वैलरी शोरूम में करीब 10 करोड़ रुपए की चोरी के मामले में पुलिस को अहम सुराग हाथ लगे हैं। शोरूम के अंदर चोरी करते 2 शातिर बदमाश की करतूत CCTV कैमरे में कैद हुई है जिसका वीडियो अब सामने आया है। वहीं घटनास्थल के आस-पास से गैस कटर, छोटा गैस सिलेंडर और सेंधमारी में इस्तेमाल किए गए कई औजार भी बरामद हुए हैं। इन्हीं साक्ष्यों के आधार पर पुलिस अब चोरों के पूरे गिरोह तक पहुंचने में जुटी है।
#KatniRobbery #JewelleryShowroom #CCTVFootage #MadhyaPradeshNews #AmarUjala
[Katni Jewellery Showroom Theft, 10 Crore Robbery, KISNA Diamond and Gold, CCTV Theft Video, Gas Cutter Recovery, Madhya Pradesh Police, Jewellery Shop Burglary]
— Amar Ujala (@AmarUjalaNews) November 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Burglars
- Diamond
- Drill Hole
- gold
RELATED ARTICLES
తాజా వార్తలు
Burglars loot jewellery showroom | జ్యుయలరీ షాపు గోడకు కన్నం వేసి.. రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాల ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

