తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి తెలిపారు. శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించిన 44 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి..
తుంగతుర్తి, నవంబర్ 13 : కుష్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి తెలిపారు. శనివారం తుంగతుర్తి మండల పరిధిలోని రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సిబ్బంది గుర్తించిన 44 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తదుపరి నిర్ధారణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో అనుమానితులకు పరీక్షలు నిర్వహించగా, నలుగురికి కుష్టు వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడం జరిగింది. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యుల సూచనల మేరకు పూర్తిస్థాయి చికిత్స తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. తద్వారా శారీరక వైకల్యాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధికి ఉచితంగా పరీక్షలు అలాగే చికిత్స అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ సురేష్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావులపల్లి లెప్రసీ నోడల్ పర్సన్ గాజుల సోమన్న, ఆశా కార్యకర్తలు, ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

