India Under -19 Squad : ఇంగ్లండ్ పర్యటనకు ముందే అండర్ -19 స్క్వాడ్‌లోని భారత యువ క్రికెటర్లు గాయపడ్డారు. దాంతో, 16మందితో కూడిన స్క్వాడ్‌లో మార్పులు చేశారు సెలెక్టర్లు. ఇంగ్లండ్ టూర్ సన్నద్ధతలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహిస్తున్న హై- పర్మార్మెన్స్ క్యాంప్‌లో ఆదిత్య రానా(Adithya Rana), ఖిలాన్ పటేల్ (Khilan Patel) గాయాలబారిన పడ్డారు. వీపు భాగంలో స్ట్రెస్ ఫ్రాక్చర్‌తో ఆదిత్య ఇబ్బందిపడగా.. ఖిలాన్ కుడి కాలి నొప్పితో బాధ పడుతున్నాడు. దాంతో, ఈ ఇద్దరి స్థానంలో ది. దీపేశ్, నమన్ పుష్పక్‌లను జూనియర్ క్రికెట్ కమిటీ ఎంపిక చేసింది.
ఇంగ్లండ్ గడ్డపై భారత కుర్రాళ్లు 50 ఓవర్ల వామప్ మ్యాచ్, నాలుగు మ్యాచ్‌ల యూత్ వన్డే కప్ సిరీస్, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనున్నారు. జూన్ – జూలై.. అంటే దాదాపు నెలన్నర రోజుల పైనే భారత అండర్ -19 జట్టు ఇంగ్లండ్‌లో ఉండనుంది. ఐపీఎల్ 18వ సీజన్లో మెరుపు బ్యాటింగ్‌తో అలరించిన మాత్రే (Ayush Mhatre) భారత అండర్ -19 బృందానికి సారథ్యం వహించనున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అరంగేట్రం చేసి.. రికార్డు సెంచరీ (35 బంతుల్లోనే)తో ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్‌లో కీలకం కానున్నాడు.
🚨 NEWS 🚨
India U19 Squad for Tour of England: Injury and Replacement Updates
Details 🔽 #TeamIndiahttps://t.co/QUoyh7ymij
— BCCI (@BCCI) June 16, 2025
అండర్ -19 స్క్వాడ్ : ఆయుశ్ మాత్రే(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సింగ్ చవ్దా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు(వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్(వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబ్రిష్, కనిష్క్ చౌహన్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఇనాన్, అన్మోల్జిత్ సింగ్. డి.దీపేశ్, నమన్ పుష్పక్.