Sports school | హుజురాబాద్ టౌన్, జూన్ 16: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 18న క్రీడా పాఠశాల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ భూపతి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని ఎమ్మార్సీ భవనంలో మండలంలోని పీడీ, పీఈటీలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. హుజురాబాద్ మండల స్థాయి క్రీడా పాఠశాల ప్రవేశ ఎంపిక పోటీలకు నాలుగవ తరగతి చదువుతూ 01 సెప్టెంబర్ 2016 నుండి 31 ఆగస్టు 2017 మధ్య జన్మించిన విద్యార్థులు పాల్గొనవచ్చని అన్నారు.
ఇదివరకే ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులు లాగిన్ అయిన రిజిస్ట్రేషన్ ఫామ్, నాలుగో తరగతి బోనఫైడ్ సర్టిఫికెట్, 5 పాస్ ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో మండల ఎస్జీఎఫ్ కన్వీనర్ చిరుత శ్రీనివాస్ ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.