IPL 2025 : ఐపీఎల్ ప్రదర్శనతో వార్తల్లో నిలిచిన ఆటగాళ్లను చాలామందినే చూశాం. స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తూ అభిమానులను అలరించే సెలబ్రిటీలను చూశాం. అయితే.. సినీతారలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ ఆమె సొంతం. తను ఎవరో కాదు కావ్యా మారన్(Kavya Maran). ఐపీఎల్ ఎడిషన్ వచ్చిందంటే చాలు ఫ్యాన్స్‌కు ఆమె పేరు గుర్తుకు వస్తుంది. ప్రతి సీజన్లో తమ జట్టు సన్‌రైజర్స్ హైదారబాద్(SRH)ను ఉత్సాహపరుస్తూ ఉండే కావ్య.. స్టేడియంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటుంది. 18వ ఎడిషన్‌లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఈ బ్యూటీ తెగ సందడి చేసింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ అయిన కావ్య.. ఆటలో పూర్తిగా లీనమైపోతుంది. అంతేకాదు ఇన్నింగ్స్ ఆసాంతం రకరకాల హావభావాలు పలికిస్తుంటుంది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు బౌండరీలు బాదేస్తుంటే చప్పట్లు, కేరింతలు కొడుతూ ఖుషీ అవుతుంది కావ్య. అందుకే.. కెమెరావాళ్లు బిగ్ స్క్రీన్‌పై ఆమె రియాక్షన్స్‌ను చూపిస్తుంటారు. మార్చి 27న ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో కావ్య.. పలురకాల ఎక్స్‌ప్రెషన్స్‌తో కెమెరా కంట పడింది.
Kavya maran has more expressions than all bollywood heroines combined 🔥❤️
Kavya maran >>heroines pic.twitter.com/IWzfyIQZI7— Mask 🎭 (@Mr_LoLwa) March 27, 2025
ఓపెనర్ ట్రావిస్ హెడ్ గాల్లోకి లేపిన బంతిని పూరన్ క్యాచ్ పట్టేందుకు సిద్ధమవుతుండగా ‘ఓ నో’ అంటూ రియాక్షన్ ఇచ్చిన కావ్య.. పూరన్ బంతిని వదిలేసినప్పుడు.. ‘ఓ గాడ్ బతికిపోయాడు’ అంటూ తలపై చేయి పెట్టుకుంది. ఇక ఛేజింగ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ధనాధన్ ఆడుతుంటూ కావ్య.. ముఖం చిన్నబోయింది. తన సీట్లో డల్‌గా కూర్చుండిపోయింది.
Kavya Maran reaction after Travis head catch drop 🙆 pic.twitter.com/DL5YlOmSm3
— Twiter kumar (@YouTubeKum11042) March 27, 2025
ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌తో 18వ సీజన్‌ను విజయంతో ఆరంభించిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిపోయింది. లక్నో బౌలర్లో శార్థూల్ ఠాకూర్(4-34) వరుస బంతుల్లో అభిషేక్ శర్మ(8), ఇషాన్ కిషన్(0)లను ఔట్ చేసి ఒత్తిడి పెంచాడు. ట్రావిస్ హెడ్(47), నితీశ్ కుమార్(32).. కుర్రాడు అనికిత్ వర్మ(36)లు ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా జట్టు స్కోర్ 200 దాటించలేకపోయారు. ఇక ఛేదనలో షమీ ఆదిలోనే బ్రేక్ ఇచ్చినా నికోలస్ పూరన్(70), మిచెల్ మార్ష్(52) విధ్వంసక బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ ఆశలపై నీళ్లు చల్లారు. మార్చి 30న జరుగబోయే తర్వాతి పోరులో కమిన్స్ సేన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టనుంది.
Not our night.#PlayWithFire | #SRHvLSG | #TATAIPL2025 pic.twitter.com/hRw5NTLN8W
— SunRisers Hyderabad (@SunRisers) March 27, 2025