టేకులపల్లి, మార్చి 28 : పెండింగ్ GPF, TSGLI, SL బిల్లులు విడుదల చేయాలనీ అలాగే DA ,PRC ప్రభుత్వం ప్రకటించాలని కోరుతూ పీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తాసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పెండింగ్ జీపీఎఫ్, పీఎస్జీఎల్ఐ, ఎస్ఎల్ బిల్లులను విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ బిల్లుల చెల్లింపు జాప్యంతో భార్యను కోల్పోయిన ఉపాధ్యాయుడు పొదిలి సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
పీఆర్టీయూ టేకులపల్లి మండల శాఖ అధ్యక్షుడు జి.మోతీలాల్ మాట్లాడుతూ.. ఆదాయం పన్ను చెల్లించి దాచుకున్న సొమ్మును తిరిగి తీసుకొనుటకు నెలలు,,సంవత్సరాలు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీఎం. విజయనిర్మల, జిల్లా ఉపాధ్యక్షుడు టి.రవీందర్, ప్రధాన కార్యదర్శి బి.రమేశ్‌బాబు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు బి.బాలు, నాయకులు బి.హతిరాం, రమణ, బి.శంకర్. సీహెచ్.మురళీధర్‌రావు, వెంకట్‌రెడ్డి, రవీందర్, విశ్రాంత సీఐ జరా భిక్షం పాల్గొన్నారు.