సిద్దిపేట, మార్చి 28: ముస్లింల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు (Rajanarsu) విమర్శించారు. కేసీఆర్ హయాంలో ముస్లింలకు ప్రతి సంవత్సరం రంజాన్ కిట్లను పంపిణీ చేశారన్నారు. సిద్దిపేట పట్టణంలోని 26వ వార్డు కౌన్సిలర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ కిట్లును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కౌన్సిలర్ ప్రవీణ్ నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందించడం గొప్ప కార్యక్రమని చెప్పారు.
మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదేశాలతో ముస్లింలకు రంజాన్ కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ తోఫా పేద ముస్లింలకు అందకుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ముస్లింలందరూ సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్య్రకమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కనకరాజు, నాయకులు వజీర్, మల్లేశం, లక్షీనారాయణ, బాబా, మల్లారెడ్డి పలువురు పాల్గొన్నారు.