ENG vs WI | విజృంభించిన వోక్స్.. వెస్టిండీస్‌కు స్వల్ప ఆధిక్యం
ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో వెస్టిండీస్(West Indies) దీటుగా బదులిస్తోంది. లార్డ్స్‌లో తేలిపోయిన కరీబియన్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు కొండంత స్కోర్ అందించారు.
ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్నరెండో టెస్టులో వెస్టిండీస్(West Indies) దీటుగా బదులిస్తోంది. లార్డ్స్‌లో తేలిపోయిన కరీబియన్ బ్యాటర్లు ఇంగ్లండ్ బౌలర్లను ఉతికేస్తూ జట్టుకు కొండంత స్కోర్ అందించారు. కవెమ్ హొడ్గే(120) తొలి సెంచరీతో గర్జించగా, అలిక్ అథనజె(82), వికెట్ కీపర్ జాషువా డ సిల్వా(82 నాటౌట్)లు అర్ధ శతకాలు బాదేశారు. దాంతో, విండీస్ తామేమీ తక్కువ కాదంటూ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగొందలు కొట్టింది. అయితే సీనియర్ పేసర్ క్రిస్ వోక్స్ విజృంభణతో మూడో రోజు పర్యాటక జట్టు 457 పరుగులకు ఆలౌటయ్యింది. దాంతో, క్రెగ్ బ్రాత్‌వైట్ సేనకు తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య రెండో టెస్టు రసపట్టులో సాగుతోంది. ట్రెంట్ బ్రిడ్జ్‌లో బజ్‌బాల్‌కు కౌంటర్ అటాక్‌గా విండీస్ బ్యాటర్లు దంచేశారు. దాంతో, రెండో రోజు తొందరగానే టాపార్డర్‌ను కూల్చిన ఆనందం బెన్ స్టోక్స్ బృందానికి లేకుండా పోయింది. కవెం హొడ్గే(120), అలిక్ అథనజె(82)లు రెండో సెషన్లో బౌండరీల వర్షం కురిపించారు.
Valuable lower order contributions give West Indies the lead against England 👏 #WTC25 | 📝 #ENGvWI: https://t.co/vrnDzpGI5a pic.twitter.com/vaxLAj9awZ
— ICC (@ICC) July 20, 2024
మార్క్ వుడ్ 152 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతులను సైతం అలకోవగా అడ్డుకొని నాలుగో వికెట్‌కు 175 పరుగులు జోడించారు. దాంతో, రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్టిండీస్ 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. అయితే.. నాలుగో రోజు క్రిస్ వోక్స్ నిప్పులు చెరుగుతూ విండీస్‌ను ఆలౌట్ ప్రమాదంలోకి నెట్టాడు. మార్క్ వుడ్ ఓవర్లో షమర్ జోసెఫ్(33) ఔట్ కావడంతో వెస్టిండీస్ 457 వద్ద ఆలౌటయ్యింది.
A terrific hundred from Kavem Hodge, the first by a West Indies batter in England since 2017 👏#WTC25 | #ENGvWI 📝: https://t.co/e1Jwl5XXvw pic.twitter.com/8TpQLcoeVd
— ICC (@ICC) July 19, 2024
పోప్ సెంచరీ..
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది. ఓలీ పోప్(121) సెంచరీతో మెరవగా.. ఓపెనర్ బెన్ డకెట్ (71), కెప్టెన్ బెన్ స్టోక్స్ (69)లు అర్ధ శతకాలో విరుచుకుపడ్డారు. విండీస్ పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో తొలి రోజు ఇంగ్లండ్ 416 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లు తీయగా..హొడ్గే, సింక్లెయిర్లు తలా రెండేసి వికెట్లతో రాణించారు.
ఇవి కూడా చదవండి
- Amazon Prime Day 2024 Sale-iPhone 13 | రూ.50 వేలలోపు ధరకే ఐఫోన్ 13.. ఇవీ డిటెయిల్స్..’
- THIW vs MLYW | జులియా పోరాటం వృథా.. బోణీ కొట్టిన థాయ్‌లాండ్
- Kanwar Yatra | భోజనంలో ఉల్లిగడ్డలు.. దాబాను ధ్వంసం చేసిన కన్వర్ యాత్రికులు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

