THIW vs MLYW : మహిళల ఆసియా కప్లో థాయ్లాండ్ (Thailand) జయభేరి మోగించింది. శనివారం మలేషియా (Malaysia)పై ఉత్కంఠ పోరులో 20 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత నన్నాపట్ కొంచరొంకాయ్ (40), ఫన్నితా మయా(29)లు బ్యాటుతో బాదేయగా ఆ తర్వాత బౌలర్లు ప్రత్యర్థిని 111 పరుగులకే కట్టడి చేశారు.
స్వల్ప ఛేదనలో థాయ్ బౌలర్లను ఉతికేసిన మలేషియా ఓపెనర్ వాన్ జులియా(52) అర్ధ శతకంతో మెరిసింది. అయితే.. మిడిలార్డర్, టెయిలెండర్ల వైఫల్యంతో మలేషియా అనూహ్యంగా ఓటమి పాలైంది. మెగా టోర్నీలో బోణీ కొట్టిన థాయ్లాండ్ గ్రూప్ బి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
𝐓𝐄𝐂𝐇𝐍𝐈𝐐𝐔𝐄: 𝐃𝐈𝐅𝐅𝐄𝐑𝐄𝐍𝐓 𝐁𝐔𝐓 𝐄𝐅𝐅𝐄𝐂𝐓𝐈𝐕𝐄 😮💨#WomensAsiaCup2024 #ACC #HerStory #MALWvTHAIW pic.twitter.com/Iuhg5qKFiH
— AsianCricketCouncil (@ACCMedia1) July 20, 2024
రెండో రోజు గ్రూప్ బి తొలి మ్యాచ్లో థాయ్లాండ్, మలేషియాలు దంబుల్లా స్టేడియం వేదికగా నువ్వానేనా అన్నట్టు తలపడ్డాయి. తొలుత నన్నాపట్ కొంచరొంకాయ్ (40), ఫన్నితా మయా(29)లు రాణించడంతో థాయ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 133 రన్స్ కొట్టింది.
Wan Julia batted with a lot of composure in the run chase 👊#WomensAsiaCup2024 #ACC #HerStory #MALWvTHAIW pic.twitter.com/OKadKsFxwP
— AsianCricketCouncil (@ACCMedia1) July 20, 2024
అనంతరం ఛేదనలో మలేషియాకు ఓపెనర్లు వినిఫ్రెడ్ దురైసింగమ్(22), వాన్ జులియా(52)లు శుభారంభిచ్చారు. తొలి వికెట్కు 69 పరుగులు జోడించి గట్టి పునాది వేశారు. కానీ, థాయ్లాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీసి ఒత్తిడి పెంచగా.. ఆ తర్వాత వచ్చిన వాళ్లంతా చేతులెత్తేయడంతో మలేషియా ఓటమి చవిచూసింది.