TTD EO | తిరుమలలో భక్తులకు మెరుగైన సేవలందించేందుకు చర్యలు : టీటీడీ ఈవో
TTD EO | తిరుమలలో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.
తిరుమల : తిరుమల (Tirumala) లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ ఈవో (TTD EO) శ్యామలారావు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) సూచనల మేరకు ప్రక్షాళన చర్యలు తీసుకుంటున్నామని శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత నెలరోజుల్లో టీటీడీలోని అన్ని విభాగాలను తనిఖీ చేసి లోపాలను గుర్తించినట్లు తెలిపారు.
ఆన్లైన్ టిక్కెట్ల జారీ వ్యవస్థలో కూడా చాలా లోపాలు గుర్తించామన్నారు. త్వరలోనే ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థలో పూర్తి పారదర్శకత ఉండేలా మార్పులు చేస్తామన్నారు. భక్తుల సమస్యలను మానిటరింగ్ చేసేందుకు ఓ వ్యవస్థ లేకపోవడాన్ని గుర్తించామని వివరించారు. క్యూ లైన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించానన్నారు.
నిపుణుల సూచనలతో అన్నప్రసాదాల నాణ్యతను కూడా పెంచామని పేర్కొన్నారు. అన్నప్రసాద సముదాయంలో నిత్యం రెండు లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నామని చెప్పారు. నెయ్యిలో నాణ్యత లేకపోవడం వల్లే లడ్డూ నాణ్యత తగ్గిందని గుర్తించామని తెలిపారు.
Read more :
AP Minister Anitha | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి అనిత
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

