Election Commission : గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సర్కార్ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్దం చేయనుంది. ఈ క్రమంలోనే సోమవారం ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది.
రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఓటరు జాబితా తయారు ప్రక్రియ మొదలవ్వనుంది. కొత్తగూడెం, కరీంనగర్, రామగుండం, నిజమాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల కార్పొరేషన్లలో ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. జాబితా రూపొందించేందుకు డిసెంబర్ 30 నుంచి జనవరి 10 వరకూ అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. జనవరి 1న డ్రాఫ్ట్ జాబితా, జనవరి 10న 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లలోని ఓటరు తుది జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది.