Fire On Cargo Ship | కార్గో షిప్లో మంటలు.. రెస్క్యూ మిషన్‌లో కోస్ట్‌గార్డ్ నౌకలు
Fire On Cargo Ship | కార్గో షిప్లో మంటలు చెలరేగాయి. దీంతో కోస్ట్‌గార్డ్ నౌకలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. కోస్ట్ గార్డ్‌కు చెందిన సుజీత్, సాచెట్, సామ్రాట్ నౌకలు ఆ కార్గో షిప్ వద్దకు చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ముంబై: కార్గో షిప్లో మంటలు చెలరేగాయి. (Fire On Cargo Ship) దీంతో కోస్ట్‌గార్డ్ నౌకలు రంగంలోకి దిగాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గోవా సముద్ర తీరంలో ఈ సంఘటన జరిగింది. ముంద్రా నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తున్న రవాణా నౌక ఎంవీ మార్స్క్ ఫ్రాంక్‌ఫర్ట్‌లో శుక్రవారం రాత్రి భారీగా మంటలు చెలరేగాయి. గోవా, కర్ణాటక మధ్య సముద్ర తీరానికి 102 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న ఆ షిప్ ప్రమాదకరమైన అంతర్జాతీయ సముద్ర వస్తువులను తీసుకెళ్తున్నది. దీంతో పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తున్నది.
కాగా, కార్గో షిప్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగింది. కోస్ట్ గార్డ్‌కు చెందిన సుజీత్, సాచెట్, సామ్రాట్ నౌకలు ఆ కార్గో షిప్ వద్దకు చేరుకున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గత 12 గంటలుగా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. హెలికాప్టర్ ద్వారా కూడా రెస్క్యూ మిషన్ కొనసాగుతున్నట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసింది.
Further updates on #MaerskFrankfurt fire:@IndiaCoastGuard Ships Sujeet, Sachet and Samrat have been fighting the fire for over 12 hours, preventing its spread. As of 0700 hrs, 20 Jul, the vessel is 6.5 NM south of #Karwar, #ICG Dornier aircraft Ex #Goa is conducting aerial… pic.twitter.com/nevStJvjpa
— Indian Coast Guard (@IndiaCoastGuard) July 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

