Pinaka Rocket : దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక (Pinaka Rocket) నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. తొలి ప్రయత్నంలోనే ఈ రాకెట్‌ను డీఆర్డీవో (DRDO) విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్టు రేంజ్ కేంద్రమైన చాందీపూర్ నుంచి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపారు. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్ధ్యం దీని సొంతం. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుంచి అనుమతి వచ్చిన రోజే పినాకను ప్రయోగించారు.
డీఆర్డీవో సహకారంతో అర్మమెంట్ రీసెర్చ్, డెవలప్మెంట్ సంస్థ, హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో పినాక రాకెట్‌ను రూపొందించారు. 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేరుకునేలా దీన్ని డిజైన్ చేశారు. సోమవారం చాందీపూర్‌లో ఈ రాకెట్ ప్రయోగాన్ని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌తో పాటు ఎక్స్పరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ పర్యవేక్షించింది.
120km ranged Pinaka LRGR 300mm rockets #DAC✔️ pic.twitter.com/l5QdkJ3LaC
— Defence Decode® (@DefenceDecode) December 29, 2025
విజయవంతంగా రాకెట్‌ను లాంచ్ చేయడంతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) డీఆర్డీవోను అభినందించారు. సుదూర లక్ష్యాలను ఛేదించగల రాకెట్లను రూపొందించడం ద్వారా భారత సైన్యం శక్తిసామర్థ్యాలు మరింత పెరుగుతాయని మంత్రి అన్నారు. ఈ ప్రయోగంలో భాగమైన సిబ్బందిని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సమిర్ వి కమాత్ అభినందించారు.