IPS Transfers : తెలంగాణలో మరోసారి ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరించడంతో నలుగురు సీనియర్ ఐపీఎస్‌లకు స్థానం చలనం తప్పలేదు. వీరి బదిలీకి సంబంధించిన జీవోను సోమవారం సీఎస్ రామకృష్ణ రావు(Rama Krishna Rao) విడుదల చేశారు. ఇప్పటివరకూ రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న జి.సుధీర్ బాబు ‘ఫ్యూచర్ సిటీ’కి సీపీగా నియమితులయ్యారు. ఈయన 2001వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి.
ప్రస్తుతం సైబరాబాద్ ఎస్పీగా కొనసాగుతున్న అవినాష్ మహంతి మల్కాజిగిరి సీపీగా బదిలీ అయ్యారు. ఈయన 2005 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 2019 బ్యాచ్ ఐపీఎల్ అయిన ఆక్షాంన్షు యాదవ్.. యాదాద్రి ఎస్పీగా వెళ్లనున్నారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్‌గా సేవలందిస్తున్న ఆయన ఇక ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రొవిజనింగ్, లాజిస్టిక్స్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(IG)గా పనిచేస్తున్న ఎం.రమేశ్ సైబరాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. ఈయన 2005 బ్యాచ్ ఐపీఎస్.
Telangana #ips transfer pic.twitter.com/xhjwiYTvqa
— Md Omer Farooq Qureshi🇮🇳 (@omerqureshi_IYC) December 29, 2025