హైదరాబాద్, మార్చి 4 : ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ ఎస్కార్ట్.. దక్షిణాదిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా శౌర్య ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వరిని అత్యధికంగా పండిస్తున్న తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలను దృష్టిలో పెట్టుకొని కుబొటాతో కలిసి తయారు చేసిన ఈ ట్రాక్టర్లు 39 హెచ్పీ నుంచి 52 హెచ్పీ సామర్థ్యం కలిగివున్నాయి.
ఈ ట్రాక్టర్ల ధరల శ్రేణి రూ.5.75-7.30 లక్షలు.