WPL 2026 : మహిళల ప్రీమియర్ లీగ్ సమీపిస్తున్న వేళ ముంబై ఇండియన్స్(Mumbai Indians) కొత్త కోచ్‌ను నియమించింది. ఇదివరకూ రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై మూడో టైటిల్ లక్ష్యంగా.. ఆస్ట్రేలియా వెటరన్ క్రిస్టెన్ బీమ్స్(Kristen Beams)ను స్పిన్ కోచ్‌గా తీసుకుంది. ఈ విషయాన్ని సోమవారం ఎక్స్ వేదికగా ఫ్రాంచైజీ వెల్లడించింది. ఈ మాజీ లెగ్ స్పిన్నర్ బీమ్స్ ముంబై క్యాంప్‌లో చేరింది.
డబ్ల్యూపీఎల్‌లో విజయవంతమైన ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా ఎంపికవ్వడంతో బీమ్స్ సంతోషం వ్యక్తం చేసింది. ఝులాన్ గోస్వామి వంటి లెజెండరీ ప్లేయర్‌తో కలిసి ముంబైకి కోచింగ్ ఇవ్వడం గొప్ప గౌరవమని చెప్పింది ఆసీస్ మాజీ కోచ్. ‘ముంబై ఇండియన్స్ సంస్కృతి అద్భుతం. వారు విజయాన్ని ఒక ఆలవాటుగా మార్చుకున్నారు. ఒక కుటంబంగా కలిసి ఉంటారు. ఈ గ్రూప్ ఒక్కటిగా ఉంటుంది. ఒకప్పుడు ఝులాన్ గోస్వామి, నేను మైదానంలో తలపడ్డాం. ఇప్పుడు ఆమెతో కలిసి శిక్షణ ఇవ్వనున్నాను’ అని బీమ్స్ వెల్లడించింది. డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. తొలి పోరులోఢిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీని డిసెంబర్ 9న ముంబై ఢీకొట్టనుంది.
ℂ𝕠𝕒𝕔𝕙 𝕃𝕚𝕤𝕒’𝕤 𝔼𝕣𝕒 𝔹𝕖𝕘𝕚𝕟𝕤 💙#AaliRe #MumbaiIndians #TATAWPL pic.twitter.com/v6Ynvf3zmK
— Mumbai Indians (@mipaltan) December 29, 2025
ఒకప్పుడు మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు ఆడిన క్రిస్టెన్ బీమ్స్ లెగ్ స్పిన్నర్‌గా మెప్పించింది. అయితే.. తన కెరీర్లో ఆమె 30 వన్డేలు, 18 టీ20లు, ఒకేఒక టెస్టు మాత్రమే ఆడింది. 2017 వన్డే ప్రపంచకప్‌లో బీమ్స్ అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచింది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఆడిన తను వీడ్కోలు తర్వాత కోచింగ్ మీద దృష్టి పెట్టింది. స్వదేశంలో బీబీఎల్‌తో పాటు ది హండ్రెడ్ లీగ్‌లోని స్పిన్నర్లకు శిక్షణనిచ్చింది. ఆస్ట్రేలియా అండర్-19 కోచ్‌గా సేవలందించిన బీమ్స్.. అనంతరం నేషనల్ డెవలప్మెంట్ బాధ్యతలు తీసుకుంది.
Spin आणि win ची recipe घेऊन #AaliRe 💙
Paltan, let’s welcome our new spin bowling coach, Kristen Beams 🙌#MumbaiIndians #TATAWPL pic.twitter.com/5xUrJgkaC5
— Mumbai Indians (@mipaltan) December 29, 2025