కమాన్పూర్ మండలం జూలపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జూలపల్లి గ్రామానికి చెందిన నీర్ల నరసమ్మ(48) అదే గ్రామంలో ఉండే తన కుమార్తె ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం నరసమ్మను ఢీ కొట్టింది. దాంతో ఘటనాస్థలంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
నరసమ్మ భర్త వెంకన్న 20రోజుక్రితం గుండెపోటుతో మృతి చెందాడు. నెల గడవక ముందే భార్యాభర్తలిద్దరు మృతి చెందడంతో జూలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతిరాలికి ఇద్దరు బిడ్డలు, కుమారుడు ఉన్నారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.