Dinesh Karthik : భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) యూటర్న్ తీసుకున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ అనంతరం.. అన్ని టీ20 లీగ్స్‌కు సైతం వీడ్కోలు పలికిన కార్తిక్ మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. దక్షిణాఫ్రికా 20 (SA20) మూడో సీజన్లో భారత క్రికెటర్ బరిలోకి దిగనున్నాడు. ఆగస్టు 5వ తేదీన బెట్‌వే ఎస్ఏ20 లీగ్ అంబాసిడర్‌గా ఎంపికైన కార్తిక్.. ఒక్కరోజులోనే మళ్లీ ఆటగాడి అవతారం ఎత్తేందుకు రెడీ అయ్యాడు.
ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు చెందిన పార్ల్ రాయల్స్(Paarl Royasl)జట్టు జెర్సీతో కార్తిక్ తళుక్కుమననున్నాడు. దాంతో, ఎస్ఏ 20లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా కార్తిక్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
From India to South Africa, this legend is signed and his flight is booked! ✈️💗 pic.twitter.com/EUvfgNrUP2
— Paarl Royals (@paarlroyals) August 6, 2024
‘దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడినప్పుడు నేను ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నా. అందుకనే ఎస్ఏ20లో ఆడాల్సిందిగా ఆఫర్ రాగానే నో చెప్పలేకపోయాను. రాయల్స్ తరఫున ఆడడం, ఈ లీగ్‌లో విజయం సాధించడం చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. సో.. పచ్చజెండా ఊపేశాను’ అని కార్తిక్ వెల్లడించాడు. ఐపీఎల్ 17వ సీజన్ అనంతరం ఆర్సీబీ ఫ్రాంచైజీ కార్తిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది జరిగే ఎస్ఏ20 మూడో సీజన్‌కు కార్తిక్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. సఫారీ లెజెండ్ ఏబీ డివిలియర్స్ (AB de VillIers)తో కలిసి అతడు లీగ్ ప్రచారంలో పాల్గొననున్నాడు. ఈ విషయాన్ని సోమవారం యాజమాన్యం అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
NEWS: Dinesh Karthik becomes the first Indian overseas player to participate in the #BetwaySA20
Check out the signing here 🔗 https://t.co/NKOvKJXsN3
— Betway SA20 (@SA20_League) August 6, 2024
ఎస్ఏ20 మూడో సీజన్ 2025 జనవరి 9న మొదలవ్వనుంది. నెల రోజుల పాటు జరిగే ఈ టోర్నీల్ ఎడెన్ మర్క్రమ్ సారథ్యంలోని సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (Sunrisers Eastern Cape) డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది.