Farooq Abdullah : బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితిపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితి కేవలం బంగ్లాదేశ్‌కు మాత్రమే కాదని, ప్రతి నియంతకు ఒక గుణపాఠమని ఆయన వ్యాఖ్యానించారు. నియంతృత్వం ఎప్పటికైనా అసంతృప్త జ్వాలలు సెగలుగక్కడానికి కారణమవుతుందని అన్నారు.
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో తీవ్రమైన అనిశ్చితి నెలకొన్నదని, వారి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఆ దేశంలో అంతర్గత పరిస్థితి కూడా అంత బాగా లేదని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. అందుకే అక్కడ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు లేవనెత్తిన ఆందోళనలను అణచివేయడం అక్కడి సైన్యానికి గానీ, ఇంకెవరికీ గానీ సాధ్యం కాలేదని తెలిపారు.