Karun Nair : భారత క్రికెట్లో పునరాగమనం అంత ఈజీ కాదు. ఫామ్, ఫిట్నెస్.. వయసు ఇవన్నీ అడ్డుపడుతాయి. కానీ, కరుణ్ నాయర్ (Karun Nair)కు మళ్లీ ఒక ఛాన్స్ వచ్చింది. ఎనిమిదేళ్ల క్రితం టీమిండియా జెర్సీ వేసుకున్న నాయర్ ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనకు స్క్వాడ్‌కు ఎంపికయ్యాడు. టాపార్డర్‌లో చెలరేగి ఆడగల అతడికి తుది జట్టులో చోటు దక్కడం ఖాయం అనిపిస్తోంది. అయితే.. ఆటగాళ్ల జీవితంలో ఎత్తుపల్లాలు ఉండడం సహజమే. కానీ, తన జీవితంలో మాత్రం గడ్డు రోజులే ఎక్కువని వాపోతున్నాడీ చిచ్చరపిడుగు.
రంజీ వీరుడిగా పేరొందిన నాయర్.. మూడేళ్ల క్రితం తన కెరియర్ ముగిసిపోయిందని అనుకున్నాడట. అంతేకాదు ప్రముఖ క్రికెటర్ ఒకరు.. ‘ఇక నీ పనైపోయింది. వీడ్కోలు పలకడమే మంచిది’ అని ఉచిత సలహా ఇచ్చాడని నాయర్ గుర్తు చేసుకున్నాడు.
The comeback is real, and so is the hunger! 🔥
After a stellar county run #KarunNair isn’t just knocking, he’s kicking the Test doors wide open! 💥#ENGvIND | 1st Test starts FRI, JUN 20, 2:30 PM Streaming on JioHotstar pic.twitter.com/j9JnvFwEtF
— Star Sports (@StarSportsIndia) June 16, 2025
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు మాజీ స్పిన్నర్ అశ్విన్ (Ashwin) యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడాడు నాయర్. ఈ సందర్భంగా అతడు క్రికెటర్‌గా తనకు ఎదురైన అత్యంత కష్టమైన దశ గురించి వివరించాడు. నేను జీవితంలో కష్టమైన దశలు చాలానే చూశాను. అయితే.. 2022లో మాత్రం గడ్డు రోజుల్ని ఎదుర్కొన్నా. అది 2018 కంటే చాలా కష్టంగా తోచాయి. ఆ సమయంలో నా కెరియర్ ముగిసిందనుకున్నా. అప్పుడు ప్రముఖ క్రికెటర్ ఒకరు నువ్వు వీడ్కోలు పలకడమే బెస్ట్ అని చెప్పాడు. అయినా సరే నాపై నేను నమ్మకం కోల్పోలేదు. ఈ రెండేళ్లలో నాలో చాలా మార్పు వచ్చింది. నాకు కష్టకాలంలో అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని నాయర్ తెలిపాడు.
విధ్వంసక ప్లేయర్ అయిన నాయర్ 2017లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌పై ట్రిపుల్ సెంచరీ బాదాడు. అనంతరం ఆస్ట్రేలియా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే.. ఏమైందో తెలియదు తదుపరి శ్రీలంక పర్యటనలో అతడి పేరు లేదు. కారణం ఏంటో కూడా సెలెక్టర్లు చెప్పలేదు. దాంతో, తనపై ఎందుకు వేటు వేశారు? అనే ప్రశ్నకు సమాధానం తెలియక అతడికి పిచ్చెక్కిపోయిందట. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నేను బాగా ఆడినా సరే పక్కన పెట్టేశారు. దాంతో, ఏం చేయాలో పాలుపోలేదు. మనసు నిమ్మలం చేసుకొని దేశవాళీ క్రికెట్ మీద ఫోకస్ పెట్టాను. మళ్లీ పరుగులు సాధించి రెండో ఛాన్స్ కోసం ఎదురుచూశాను. నా నమ్మకం నిజమైంది. ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత అవకాశం వచ్చింది అని వివరించాడు విదర్భ క్రికెటర్.
Karun Nair reveals the retirement advice he had received from a prominent Indian cricketer when things were not going well for him in his career. pic.twitter.com/Q3qCvunZ3z
— Circle of Cricket (@circleofcricket) June 16, 2025
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీతో వార్తల్లో నిలిచిన నాయర్.. ఆ తర్వాత అనుకోకుండా కనుమరుగయ్యాడు. అయితే.. గోడకు కొట్టిన బంతిలా మళ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో అలరిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. నిరుడు రంజీల్లో సెంచరీల మోత మోగించిన ఈ రైట్ హ్యాండర్ ఐపీఎల్ 18వ సీజన్లో కళాత్మక ఇన్నింగ్స్‌లు ఆడాడు. దాంతో, ఇంగ్లండ్ పర్యటన కోసం స్క్వాడ్‌లో స్థానం సంపాదించాడు. ప్రాక్టీస్ మ్యాచులో ఇంగ్లండ్ లయన్స్‌పై ద్విశతకం(219)తో రెచ్చిపోయాడీ హిట్టర్. జూన్ 20 న జరుగబోయే తొలి టెస్టులో ఆడే అవకాశం రావాలేగానీ పరుగుల వరద పారించాలని ఉవ్విళ్లూరుతున్నాడు నాయర్.