Sanju Samson : ఐపీఎల్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో అలరించే సంజూ శాంసన్ (Sanju Samson) తన సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టుకు ట్రోఫీ అందించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు సంజూ. కానీ, అతడి కల నిజం కావడం లేదు. దాంతో… జెర్సీ మారిస్తేనే లక్ మారుతుందని భావిస్తున్నాడు. ఇన్నాళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాజస్థాన్ జట్టును వీడేందుకు సిద్దమవుతున్నాడు. ఈమధ్య అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్న పోస్ట్‌లు అందుకు బలం చేకూరుస్తున్నాయి.
ఇంతకూ సంజూ ఏ ఫ్రాంచైజీ గూటికి చేరనున్నాడో తెలుసా.. చెన్నై సూపర్ కింగ్స్. ఇంటర్నెట్లో ‘సంజూ రిలీజ్డ్.. సీఎస్కే రెడీ’ అంటూ ధోనీ, శాంసన్ నవ్వుతూ ఉన్న పోస్ట్‌లు వైరలవుతున్నాయి. ఆ పోస్ట్‌లు చూసినవాళ్లంతా శాంసన్.. సీఎస్కే ఫ్రాంచైజీకి ఆడడం ఖాయం అని మస్త్ ఖుషీ అవుతున్నారు.
BUZZ : SANJU SAMSON TO JOIN CSK 🚨💛 pic.twitter.com/xlcQiTBJmW
— CSK Fans Army™ (@CSKFansArmy) June 16, 2025
ఐపీఎల్ హిట్టర్లలో ఒకడైన శాంసన్ 2021లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా ఎంపికయ్యాడు. అతడి కెప్టెన్సీలో రాజస్థాన్ 2022 ఎడిషన్‌లో ఫైనల్ చేరినా కప్ కొట్టలేకపోయింది. ఆ తర్వాత మాత్రం ప్లే ఆఫ్స్‌కు ముందే ఆ జట్టు కథ ముగిస్తూ వస్తోంది. 18వ సీజన్లోనూ అంతే. సీజన్ ఆరంభంలో గాయం కారణంగా కీలక మ్యాచ్‌లకు దూరమైన శాంసన్.. ఆఖర్లో జట్టులోకి వచ్చాడు.. కానీ, అప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ ఆశలు అడుగంటాయి. దాంతో, తీవ్ర నిరాశకు గురైన శాంసన్ 19వ సీజన్లో కొత్త జట్టుకు ఆడాలనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Sanju Samson”s Recent post on Instagram,
1. Crossing the Yellow line
2. Tamil Background Song
3. Song movie name 7’am arivu
4. Photo Caption: “Time to Move”Is it happening Samson to CSK? pic.twitter.com/0xVNYoFmla
— Registanroyals (@registanroyals) June 16, 2025
‘క్రాసింగ్ ది ఎల్లో లైన్, తమిళ బ్రాక్ గ్రౌండ్ పాటలు, 7 ఏఎం అరివు’తో పాటు ‘టైమ్ టు మూవ్’ అనే పోస్ట్‌లు పెట్టాడు. అవన్నీ గమనిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడేందుకు శాంసన్ ఆరాటపడుతున్నాడని తెలుస్తోంది. ఎలాగూ వచ్చే సీజన్లో ధోనీ ఆడడంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వికెట్ కీపర్, పవర్ హిట్టర్ అయిన సంజూ సీఎస్కేకు ఎంతో పనికొస్తాడు. సో.. అతడు వస్తానంటే సీఎస్కే కళ్లకు అద్దుకోవడం ఖాయం. అయితే.. 19వ సీజన్ ప్రారంభానికి ముందే శాంసన్ రాజస్థాన్‌కే ఆడుతాడా? పసుపు జెర్సీ వేసుకుంటాడా అనే విషయంలో స్పష్టత రానుంది.
Sanju Samson’s Manager has liked the post of Sanju Samson getting traded to CSK
HOMECOMING FOR SANJU?? pic.twitter.com/qPCbsEnQFJ
— Forever_ICT (@loyal_cskian) June 16, 2025