Garbage | మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 16 : తడి-పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు వేరుగా చేసి చెత్త ఆటోలలో వేయాలని నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డి అన్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సోమవారం మున్సిపల్ పకరిధిలోని ఈస్ట్ గాంధీ నగర్, శ్రీ సాయి కాలనీలో సీసీ రోడ్డు పనులను కమిషనర్ ప్రారంభించారు. పలు వార్డులలో తడి-పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు వేరుగా అందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం రాంపల్లి సుచిత్ర కాలనీలో నాలాను పూడిక తీత పనులను కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కారానికి మున్సిపల్ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సురేష్ రెడ్డి, అధికారులు తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత