నల్లగొండ విద్యా విభాగం, జూన్ 16 : ఉన్నత ప్రమాణాలతో విద్యా బోధన ద్వారా నాణ్యమైన మానవ వనరులు తయారు చేయాల్సిన బాధ్యత పీజీ కళాశాలలపై ఉందని మహాత్మాగాంధృ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఫ్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం వర్సిటీలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 శాతం హాజరు నియమాన్ని విధిగా పాటించాలని, అందుకు బయోమెట్రిక్ విధానాన్ని సత్వరమే అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మెంటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. విద్యార్థులకు లైబ్రరీ, పరిశోధన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడిట్ సెల్ డైరెక్టర్ వై.ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ జయంతి, అధికారులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.