కొత్తకోట : కొత్తకోట పట్టణంలో నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను (Indiramma houses) ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటీవల కొత్తకోటలో ( Kottakota ) కొంతమంది లబ్ధిదారులను గుర్తించి ఇండ్లకు సంబంధించిన ప్రొసిడింగ్ కాపీలను అందజేశారని తెలిపారు. ఎస్సీ కాలనీలో ఇటీవల వర్షానికి కూలిన కుటుంబానికి ఇల్లు మంజూరు చేయకపోవడంతో వారు ఆందోళనకు గురవుతున్నారని ఆరోపించారు.
కవేలలో నివాసం ఉంటున్న మరో కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వర్షం వస్తే ఇంట్లోకి నీరు చేరడం వలన రాత్రిపూట పడుకోవడానికి స్థలం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులకు ఇవ్వకపోవడంతో దారుణమని అన్నారు. ఖాళీ స్థలాలు ఉన్నవారికి ఇండ్లు మంజూరు చేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.