WIW vs NZW : మహిళల టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్లో మరో ఉత్కంఠ పోరు. ‘నువ్వా నేనా’ అన్నట్టు సాగిన రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. స్వల్ప ఛేదనలో టాపార్డర్ విఫలమైన వేళ జట్టును గెలపించేందుకు ఆల్‌రౌండర్ డియాండ్ర డాటిన్ (33) విశ్వ ప్రయత్నం చేసింది. కానీ, ఈడెన్ కార్సన్(3/29), అమేలియా కేర్(2/14)లు తిప్పేయడంతో కరీబియన్ హిట్టర్లు తలొంచక తప్పలేదు. అక్టోబర్ 20, ఆదివారం జరుగబోయే ఫైనల్లో దక్షిణాఫ్రికాను కివీస్ ఢీ కొట్టనుంది.
రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ నిర్దేశించిన స్వల్ప ఛేదనలో వెస్టిండీస్ తడబడింది. ఇంగ్లండ్‌పై చెలరేగిన ఓపెనర్ క్వియానా జోసెఫ్ (12)ను కార్సన్ బౌల్డ్ చేసి న్యూజిలాండ్‌కు బ్రేకిచ్చింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్(15), షెమైనే క్యాంప్బెల్లె(3)లు ఆచితూచి ఆడడంతో.. పవర్ ప్లేలో విండీస్ స్కోర్.. 25 మాత్రమే. అనంతరం బంతి అందుకున్న కార్సన్.. స్టఫానీ టేలర్(13)ను బౌల్డ్ చేసి మూడో వికెట్ ఖాతాలో వేసుకుంది. 10 ఓవర్లు అయినా స్కోర్ 50 దాటకపోవడంతో ఒత్తిడి పెరిగిపోయింది.
NEW ZEALAND WILL HAVE A THIRD SHOT AT THE WOMEN’S T20 WORLD CUP!
🔗 https://t.co/bZKYQBITby | #T20WorldCup pic.twitter.com/EBOYMr6qKn
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
ఈ క్రమంలోనే డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడిన మాథ్యూస్(15) అమేలియా చేతికి చిక్కింది. దాంతో, కరీబియన్ జట్టు కీలక వికెట్ కోల్పోయింది. ఇక జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్న డియాండ్ర డాటిన్(33) రెండు లైఫ్స్ లభించాయి. అయినా కివీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయగా 4.5 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ రాలేదు.మైర్ వేసిన 15వ ఓవర్లో ఫ్లెచర్ (17) బౌండరీ బాదగా.. ఆ తర్వాతి తహుహుకు డాటిన్ సిక్సర్‌తో స్వాగతం పలికింది. అప్పటికీ సాధించాల్సిన రన్ రేటు 10 పైనే ఉంది.
ఇక లాభం లేదనుకున్న డాటిన్ చివరి రెండు బంతుల్ని సైతం స్టాండ్స్‌లోకి పంపింది. అంతే.. అప్పటిదాకా బిక్కమొహాలతో కనిపించిన విండీస్ డగౌట్లో ఆమె జోష్ నింపింది. కానీ, అమేలియా ఆమెను ఔట్ చేసి కివీస్‌కు పెద్ద బ్రేకిచ్చింది. అయితే.. జైదా జేమ్స్(14), అఫీ ఫ్లెచర్(13)లు డెత్ ఓవర్లలో ధాటిగా ఆడారు. బేట్స్ వేసిన 20వ ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా జైదా తొలి బంతిని బౌండరీకి పంపింది. కానీ, మూడో బంతికి బౌల్డ్ అయింది. అంతే.. విండీస్ ఓటమి ఖాయమైంది. 8 పరుగుల తేడాతో గెలుపొందిన కివీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
2009 ✅
2010 ✅
𝟐𝟎𝟐𝟒 ✅NEW ZEALAND MAKE THE WOMEN’S T20 WORLD CUP FINAL AFTER 14 YEARS! pic.twitter.com/z8pyttc0sW
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. కెప్టెన్ సోఫీ డెవిన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు సుజీ బేట్స్(26), జార్జియా ప్లిమ్మెర్(33)లు ధంచి కొట్టారు. దాంతో, పవర్ ప్లేలో కివీస్ స్కోర్ పరుగులు తీసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కరిష్మా రామ్హరాక్ విడదీసింది. ఆ కాసేపటికే ప్లిమ్మెర్ను ఫ్లెచర్ బోల్తా కొట్టించింది. అంతే.. అక్కడితో న్యూజిలాండ్ స్కోర్ నెమ్మదించింది.
కెప్టెన్ సోఫీ డెవినె(12), బ్రూక్ హల్లిడే(18)లు విండీస్ బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు. డియాండ్రా డాటిన్ (4/22) విజృంభణతో నెమ్మదించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు వికెట్ కీపర్ ఇజబెల్లా గేజ్(20 నాటౌట్) ఊపు తెచ్చింది. డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడిన ఆమె జట్టు స్కోర్ 120 దాటించింది. ఇజబెల్లా మెరుపులతో కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది.