అశోక్‌నగర్ ఏమైనా టెర్రరిస్ట్ హబ్బా? లేక అదేమైనా శుత్రు దేశమా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్‌నగర్‌లో ఉన్న లైబ్రరీలో చదువుకుంటున్న గ్రూప్-1 అభ్యర్థులను లైబ్రరీ లోపల ఉన్న స్టడీ హాల్స్ లో చొరబడి లాఠీచార్జి ఎందుకు చేస్తున్నారు? అని నిలదీశారు. పరీక్షలు నిర్వహించరాకపోతే.. మాకు చేతకాదు అని చెప్పండి కానీ నిరుద్యోగులను ఎందుకు చితకబాదుతారని ప్రశ్నించారు.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని ఆందోళనకు దిగిన అభ్యర్థులపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యహరించిన తీరుపై ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఆర్ఓలు, ఆర్డిఓలు, డిప్యూటీ కలెక్టర్ లు, డీఎస్పీ లు కావాల్సిన వాళ్ళ పైనా మీ ప్రతాపం? అని ధ్వజమెత్తారు. సమైక్య పాలనలో.. సమైక్యవాదులు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని మండిపడ్డారు. వెంటనే గ్రూప్స్ అభ్యర్థుల సమస్యను పరిషరించాలని, ఆ తర్వాతే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమంగా దాడి చేసిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
అశోక్ నగర్ ఏమైనా టెర్రరిస్ట్ హబ్బా? లేదా అదేమైనా మన శత్రు దేశమా?
లైబ్రరీ లోపలికి, స్టడీ హాల్స్ లోపలికి చొరబడి లాఠీచార్జి ఎందుకు చేస్తున్నారు?
పరీక్షలు నిర్వహించరాకపోతే మాకు చేతకాదు అని చెప్పండి కానీ నిరుద్యోగులను ఎందుకు చితకబాదుతారు?
ఎం ఆర్ ఓ లు, ఆర్ డి ఓ లు, డిప్యూటీ… pic.twitter.com/ReoZ1GyYKK
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) October 18, 2024