WIW vs NZW : మహిళల టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ స్వల్ప స్కోర్‌కే పరిమితం అయింది. ఓపెనర్లు సుజీ బేట్స్(26), జార్జియా ప్లిమ్మెర్(33)లు శుభారంభం ఇచ్చినా కివీస్ మిడిలార్డర్ విఫలమైంది. మాజీ చాంపియన్ వెస్టిండీస్ బౌలర్ల ధాటికి కివీస్ కెప్టెన్ సోఫీ డెవినె(12) సైతం చేతులెత్తేసింది. డియాండ్రా డాటిన్ (4/22) విజృంభణతో నెమ్మదించిన న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌కు వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్(20 నాటౌట్) ఊపు తెచ్చింది.
డెత్ ఓవర్లలో ధనాధన్ ఆడిన ఆమె జట్టు స్కోర్ 120 దాటించింది. ఇజబెల్లా మెరుపులతో కివీస్ జట్టు 9 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌పై చితక్కొట్టిన విండీస్ బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని ఊదేస్తారా? లేదా? అనేది కాసేపట్లో తేలిపోనుంది.
New Zealand huff and puff to 128; West Indies have bowled brilliantly 👏
🔗 https://t.co/bZKYQBITby | #T20WorldCup pic.twitter.com/oQw1VJPgti
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ తీసుకుంది. కెప్టెన్ సోఫీ డెవిన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు సుజీ బేట్స్(26), జార్జియా ప్లిమ్మెర్(33)లు ధంచి కొట్టారు. దాంతో, పవర్ ప్లేలో కివీస్ స్కోర్ పరుగులు తీసింది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని కరిష్మా రామ్హరాక్ విడదీసింది. ఆ కాసేపటికే ప్లిమ్మెర్ను ఫ్లెచర్ బోల్తా కొట్టించింది. అంతే.. అక్కడితో న్యూజిలాండ్ స్కోర్ నెమ్మదించింది. కెప్టెన్ సోఫీ డెవినె(12), బ్రూక్ హల్లిడే(18)లు విండీస్ బౌలింగ్ దళాన్ని సమర్ధంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ వేగం అందుకుంటున్న వేళ ఆల్‌రౌండర్ డాటిన్ (4/22) యార్కర్లతో బెంబేలెత్తించింది. తన పేస్ పవర్ చూపిస్తూ ఆమె ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను దెబ్బకొట్టింది. 17వ ఓవర్లో తొలి బంతికి గ్రీన్‌ను ఔట్ చేసిన డాటిన్.. నాలుగో బంతికి మైర్‌ను వెనక్కి పంపింది. ఆ తర్వాత వచ్చిన ఇసబెల్లా గేజ్(20 నాటౌట్) ధాటిగా ఆడి జట్టుకు పోరాడగలిగే స్కోర్ అందించింది. దాంతో, న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
World boss dominating at the world stage 🔥
🔗 https://t.co/bZKYQBITby | #T20WorldCup pic.twitter.com/NyS4z2sSpQ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 18, 2024