Man Beaten To Death | వివాహిత మహిళతో సంబంధంపై అనుమానం.. వ్యక్తిని కొట్టి చంపిన జనం
Man Beaten To Death | మహిళతో ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె అత్తింటి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళను కలిసేందుకు ఆ గ్రామానికి వచ్చిన అతడ్ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జైపూర్: మహిళతో ఒక వ్యక్తికి వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆమె అత్తింటి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ఆ మహిళను కలిసేందుకు ఆ గ్రామానికి వచ్చిన అతడ్ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. (Man Beaten To Death) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని నీమ్ క థానా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బన్సూర్‌లో నివాసముంటున్న 25 ఏళ్ల ముఖేష్ కుమార్ మీనా టెంట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏడాది కిందట సమీపంలోని రావత్ మజ్రా గ్రామంలో పని కోసం వెళ్లాడు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన ఒక మహిళ అతడికి పరిచయమైంది.
కాగా, అక్టోబర్ 16న రాత్రివేళ ముఖేష్ కుమార్ మీనా ఆ గ్రామానికి వెళ్లాడు. ఆ మహిళను కలిసేందుకు ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉందని ఆమె అత్తింటి వారు అనుమానించారు. ముఖేష్‌ను పట్టుకుని బంధించి దారుణంగా కొట్టారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న ముఖేష్‌ను హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మృతుడి సోదరి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆరుగురు వ్యక్తులపై కిడ్నాప్, హత్య కేసు నమోదు చేశారు. ఆ మహిళ అత్తమామలతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

