లక్నో : రంజీ ట్రోఫీలో కర్ణాటక 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫైనల్‌కు దూసుకెళ్లింది. లక్నోలో ఉత్తరాఖండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో ఆ జట్టు.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఫైనల్‌కు ప్రవేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కర్ణాటక 736 పరుగుల భారీ స్కోరు చేయగా ఉత్తరాఖండ్ 233 రన్స్‌కే కుప్పకూలడంతో ఆ జట్టుకు 503 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ 323 రన్స్ చేసింది.
తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రవిచంద్రన్ స్మరణ్ (127*) మరోసారి అజేయ శతకం బాదాడు. దీంతో మొత్తంగా 827 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన ఉత్తరాఖండ్.. 260/6తో నిలిచింది. ఫైనల్లో కర్ణాటక.. తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన జమ్మూకశ్మీర్‌తో హుబ్లీ వేదికగా అమీతుమీ తేల్చుకోనుంది.