Test Captain : సొంతగడ్డపై తిరుగులేని భారత జట్టుకు మొట్టమొదటిసారి ఊహించని ఝలక్ ఇచ్చింది న్యూజిలాండ్. ఆల్‌రౌండ్ షోతో రోహిత్ శర్మ (Rohit Sharma) బృందాన్ని వైట్‌వాష్ చేసి క్లీన్ స్వీప్‌తో టామ్ లాథమ్ జట్టు చరిత్ర సృష్టించింది. దాంతో, స్వదేశంలో బోణీ కొట్టకుండానే టెస్టు సిరీస్ సమర్పించుకున్న తొలి కెప్టెన్‌గా రోహిత్ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్‌మ్యాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి .. వికెట్ కీపర్ రిషభ్ పంత్ (Rishabh Pant)ను నాయకుడిగా ఎన్నుకోవాలని అన్నాడు.
సుదీర్ఘ ఫార్మాట్లో పెద్దగా క్లిక్ కాని రోహిత్ శర్మ న్యూజిలాండ్‌పై కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యాడు. ఇదే విషయాన్ని అతడు స్వయంగా అంగీకరించాడు కూడా. అందుకని సీనియర్లను తప్పించి రంజీల్లో చెలరేగుతున్న కుర్రాళ్లతో జట్టును నింపేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల మాటలతో ఏకీభవిస్తున్న కైఫ్ పంత్‌ను భావి కెప్టెన్‌గా అభివర్ణించాడు.
Future Captain Pant tried to hold fort, but not our day. #INDvNZ pic.twitter.com/fzrs9wJJ0I
— Prashant Mullick, PhD (@VohiCapital) November 3, 2024
‘ప్రస్తుతం జట్టులో ఉన్నవాళ్లలో కెప్టెన్సీకి పంత్ ఒక్కడే పోటీదారుడు కూడా. అందుకు అతడికి అన్ని అర్హతులు ఉన్నాయి. అతడు మైదానంలోకి దిగిన ప్రతిసారి జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ఆడుతాడు. అందుకని హిట్‌మ్యాన్ వారసుడిగా పంత్‌ను ప్రకటించాలి’ అని కైఫ్ వెల్లడించాడు. పంత్ బ్యాటింగ్ నైపుణ్యాన్ని కైఫ్ పొగుడుతూ ఏం అన్నాడంటే.. ‘పంత్ అన్నిరకాల పరిస్థితుల్లో పరుగులు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా.. ఇలా కష్టమైన పిచ్‌ల మీద అతడు దంచేశాడు. పేస్, స్పిన్.. పిచ్ ఏదైనా సరే అందుకు తగ్గట్టు ఆడగల సమర్ధుడు పంత్.
ఇంకా చెప్పాలంటే.. తన ఆఖరి టెస్టు అనంతరం ఓ దిగ్గజంగా వీడ్కోలు పలుకుతాడు. ఇప్పటికే పంత్ తాను ఎంత ప్రమాదకరమో చాటాడు. వాంఖడేలో అతడు క్రీజులో ఉన్నంత వరకూ న్యూజిలాండ్ జట్టుకు ఊపిరి ఆడలేదు’ అని కైఫ్ వెల్లడించాడు. వాంఖడేలో జరిగిన మూడో టెస్టులో పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టాపార్డర్ విఫలమైన చోట ఇలా ఆడాలని చూపిస్తూ 64 పరుగులతో కివీస్ బౌలర్లను భయపెట్టాడు. అయితే.. లంచ్ అనంతరం అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో డగౌట్ చేరగా.. ఆ తర్వాత 21 పరుగులకే టీమిండియా ఆలౌటయ్యింది.
That’s a gritty half-century from Rishabh Pant 👌👌
His 14th FIFTY in Test Cricket 👏👏
Scorecard – https://t.co/KNIvTEyxU7#TeamIndia | #INDvNZ | @IDFCFIRSTBank | @RishabhPant17 pic.twitter.com/l8xULaauZM
— BCCI (@BCCI) November 3, 2024
నవంబర్‌లో భారత జట్టు కీలకమైన సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ సేన కమిన్స్ బృందాన్ని ఢీకొట్టనుంది. గతంలో వరుసగా రెండు విజయాలు సాధించినప్పటికీ.. కివీస్‌పై సిరీస్ ఓటమి టీమిండియా స్థయిర్యాన్ని దెబ్బతీసిందనే చెప్పాలి.
వైట్‌వాష్ అవమానం నుంచి తొందరగా కోలుకుని కంగారూలను కంగారెత్తించాలి. లేదంటే మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడడం భారత్‌కు దాదాపు అసాధ్యమే. నవంబర్ 22న పెర్త్ వేదికగా ఇండియా, ఆసీస్‌లు తొలి టెస్టు ఆడనున్నాయి. మరో విషయం ఏంటంటే 1999 తర్వాత తొలిసారి బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని ఐదు టెస్టుల మ్యాచ్‌గా నిర్వహిస్తున్నారు.