Appudo Ippudo Eppudo | టాలీవుడ్ యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. ఛత్రపతి, డార్లింగ్ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ టాప్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రోడక్షన్స్పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ మూవీని నవంబర్ 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమాలో నిఖిల్ ఫార్మూల వన్ రేసర్‌గా కనిపించబోతున్నాడు. హైదారాబాద్‌లోని ఒక బస్తిలో ఉండే నిఖిల్ లండన్ వెళ్లి ఒక తెల్ల పిల్లను ప్రేమలో పడేసి లైఫ్‌లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అయితే దీనికోసమే లండన్ వెళ్లిన నిఖిల్‌కు అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి అనేది ఈ మూవీ స్టోరీ అని తెలుస్తుంది. ఓ లవ్ స్టోరీతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.