IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఇప్పటివరకూ భారీ స్కోర్ల మ్యాచులే. ఇంకేముంది రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు కూడా దంచేస్తారని అనుకుంటే సీన్ రివర్స్ అయింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్ల ధాటికి ఆ జట్టు టాపార్డర్ కప్పకూలింది. వరుణ్ చక్రవర్తి(2-17), మోయిన్ అలీ(2-32)లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు చెమటోడ్చారు. ఓపెనర్ సంజూ శాంసన్(29) మరోసారి నిరాశపరచగా.. యువకెరటం ధ్రువ్ జురెల్(33) సమయోచితంగా ఆడి జట్టు స్కోర్ 100 దాటించాడు. ఆఖర్లో జోఫ్రా ఆర్చర్(16) రెండు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ 150 మార్క్ అందుకోగలిగింది.
టాస్ ఓడిన రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆది నుంచి తడబడుతూ సాగింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(13), సంజూ శాంసన్(29)లు శుభారంభమిచ్చినా స్పిన్నర్ల రాకతో వికెట్ల పతనం మొదలైంది. 3 ఓవర్లకే 28 పరుగులు రాబట్టిన ఈ జోడిని వైభవ్ అరోరా విడదీశాడు. శాంసన్ బౌల్డ్ అయ్యాక వచ్చిన కెప్టెన్ రియాన్ పరాగ్ (25) ఉన్నంత సేపు బౌండరీతో విరుచుకపడ్డాడు. అతడికి చెక్ పెట్టేందుకు రహానే తమ అస్త్రం వరుణ్ చక్రవర్తికి బంతి అందించాడు.
Fighting effort from Dhruv Jurel comes to an end 👏👏
He goes back for a valiant 33(28).
Predict #RR‘s final score ✍
Updates ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR pic.twitter.com/iMqpNa1Kud
— IndianPremierLeague (@IPL) March 26, 2025
అనుకున్నట్టే పరాగ్ భారీ షాట్ ఆడబోయి వికెట్ కీపర్ డికాక్ చేతికి చిక్కాడు. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మోయిన్ అలీ.. డేంజరస్ యశస్వీని డగౌట్‌కు పంపాడు. కాసేపటికే వనిందు హసరంగ(4) ను వరుణ్ ఔట్ చేయగా.. ఫామ్ లేమితో తంటాలు పడుతున్న నితీశ్ రానా(8)ను మోయిన్ అలీ బౌల్డ్ చేశాడు. దాంతో, 82కే ఐదు వికెట్లు పడ్డాయి.
సగం వికెట్లు పడిన దశలో ధ్రువ్ జురెల్(33) సాధికారిక ఇన్నింగ్స్ ఆడాడు. కోల్‌కతా స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ.. శుభం దూబే(9), షిమ్రాన్ హెట్‌మైర్(7)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆఖరి ఓవర్లలో ధాటగా ఆడే ప్రయత్నం చేసిన జురెల్‌ను రాజస్థాన్ మరింత కష్టాల్లోకి నెట్టాడు. జోఫ్రా ఆర్చర్(16) రెండు సిక్సర్లు బాదడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
I.C.Y.M.I
In the 𝘼𝙍𝘾 for 𝘼𝙧𝙘𝙝𝙚𝙧 🏹
And dispatched ✅How crucial will these hits be for #RR? 🤔
Scorecard ▶ https://t.co/lGpYvw87IR#TATAIPL | #RRvKKR | @rajasthanroyals pic.twitter.com/SBnsVTrbuy
— IndianPremierLeague (@IPL) March 26, 2025