IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో తొలి విజయంపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్ కష్టాల్లో పడింది. ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కోల్‌కతా కెప్టెన్ రహానే స్పిన్నర్లను రంగంలోకి దింపడంతో సంజూ శాంసన్(29), రియాన్ పరాగ్(25), యశస్వీ జైస్వాల్(13)లు పెవిలియన్ చేరారు. వరుణ్ చక్రవర్తి మాయ చేయడంతో కాసేపటికే నాలుగో వికెట్ పడింది. ప్రస్తుతం నితీశ్ రానా(4), ధ్రువ్ జురెల్(1)లు ఆచితూచి ఆడుతున్నారు. 10 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్..76-4.
టాస్ ఓడిన రాజస్థాన్‌కు ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(13), సంజూ శాంసన్(29)లు శుభారంభమిచ్చారు. 3 ఓవర్లకే 28 పరుగులు రాబట్టారు. అయితే.. వైభవ్ అరోరా బంతిని అంచనా వేయలేక శాంసన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ (25) బౌండరీతో విరుచుకపడ్డాడు.
Spinners casting their magic 🪄
First Varun Chakravarthy and then Moeen Ali 💜
Updates ▶ https://t.co/lGpYvw7zTj#TATAIPL | #RRvKKR | @KKRiders pic.twitter.com/EfWc2iLVIx
— IndianPremierLeague (@IPL) March 26, 2025
అలానే ధనాధన్ ఆడే క్రమంలో.. వరుణ్ చక్రవర్తి ఓవర్లో కీపర్ డికాక్ చేతికి చిక్కాడు పరాగ్. ఆ షాక్ నుంచి తేరుకునే లోపే మోయిన్ అలీ.. డేంజరస్ యశస్వీని డగౌట్‌కు పంపాడు. కాసేపటికే వనిందు హసరంగ(4)ను వరుణ్ ఔట్ చేసి రాజస్థాన్ మరింత కష్టాల్లోకి నెట్టాడు.