Mohan Bhagwat | శ్రీశైలం : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైల క్షేత్రాని దర్శించుకున్నారు. ఆలయ రాజ గోపురం వద్దకు ఆయనకు ఈవో శ్రీనివాస రావు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చక వేద పండితులు తిలకధారణ చేశారు. అనంతరం మోహన్ భగవత్ మల్లికార్జున స్వామి వారిని, భ్రమరాంబ అమ్మవారలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. అనంతరం శేషవస్త్రంతో సత్కరించి స్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని బహూకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.