లండన్: వచ్చే నెల 2 నుంచి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో జరగాల్సి ఉన్న రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ తమ జట్టులో స్వల్ప మార్పులు చేసింది. ఆ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను రెండో టెస్టుకు గాను జట్టులోకి తీసుకుంది. నాలుగేండ్ల తర్వాత ఆర్చర్ టెస్టు జట్టులోకి రావడం గమనార్హం.
చివరిసారిగా అతడు 2021లో భారత్‌తోనే టెస్టు ఆడాడు. ఆ తర్వాత వరుసగా గాయాలబారిన పడ్డ ఆర్చర్.. ఇటీవలే కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరఫున ఆడాడు. అయితే తుది జట్టులో ఆర్చర్ ఉంటాడా? లేదా? అన్నది త్వరలో తేలనుంది.