Joe Root : క్రికెట్ మైదానంలో బ్యాటర్ల మెరుపులు.. బౌలర్ల వికెట్ల వేట.. ఫీల్డింగ్ విన్యాసాలు అభిమానులను అలరిస్తాయి. అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. తాజాగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య ముల్తాన్ (Multan) వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో అలాంటి ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ సారథి జో రూట్ (Joe Root) బంతికి మెరుపు తేవడం కోసం సరికొత్తగా ప్రయత్నించాడు.
నున్నటి అరగుండుతో ఉండే స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach) తలపై బంతిని రుద్దాడు. అరేయ్.. నీ గుండు భలే ఉంది. అలాగే ఉండు బంతిని కాస్త మెరుపు తెద్దాం అన్నట్టు రూట్ అతడి గుండు మీద బంతిని కాసేపు రుద్దాడు. రూట్ అలా బంతికి నునుపు తెచ్చేందుకు ప్రయత్నించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దాంతో, క్షణాల్లోనే ఆ వీడియో వైరల్ అయింది.
Joe Root finding the best ways to shine the ball 🤣 pic.twitter.com/nUnI58voVI
— Sky Sports Cricket (@SkyCricket) October 15, 2024
తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో గెలుపొందని ఇంగ్లండ్.. రెండో టెస్టులోనూ జోరు చూపిస్తోంది. మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను గెలిపించిన లీచ్ మరోసారి మ్యాజిక్ చేశాడు. తొలి సెషన్లోనే ఓపెనింగ్ జోడీని విడదీసిన జాక్ లీచ్ పర్యాటక జట్టుకు బ్రేకిచ్చాడు. మొదటి టెస్టులో సెంచరీలు బాదిన ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(7), కెప్టెన్ షాన్ మసూద్(7)లను ఔట్ చేసిన అతడు పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.
Jack Leach strikes again! 🤩
Shan Masood chips to Zak Crawley at short midwicket and Pakistan are two down.
🇵🇰 1️⃣9️⃣-2️⃣ pic.twitter.com/P7DzYD0xrU
— England Cricket (@englandcricket) October 15, 2024
అయితే.. అరంగేట్ర కుర్రాడు కమ్రాన్ గులాం(102 నాటౌట్) అద్భుత సెంచరీ సాధించాడు. మరోవైపు సయీం ఆయూబ్(77) సైతం అర్ధ శతకంతో రాణించాడు. ఈ ఇద్దరూ ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని కీలక భాగస్వామ్యం నిర్మించి పాక్‌ను ఆదుకున్నారు. దాంతో, మొదటిరోజు మూడో సెషన్లో పాక్ 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేయగలిగింది.