Bye Elections | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రెండు లోక్‌సభ, 48 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు (Bye Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఇవాళ ప్రకటించింది.
కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్‌సభ స్థానంతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 47 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు ఉంటాయని తెలిపింది. ఇందుకోసం అక్టోబర్ 18న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 25న నామినేషన్ల స్వీకరణకు చివరి గడువు కాగా.. నామినేషన్ల ఉపసంహరణకు 30వ తేదీ వరకూ గడువు ఇచ్చింది.
ఇక నవంబర్ 13న ఎన్నికలు ఉంటాయి. 23వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దీంతోపాటు ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని కేదార్నాథ్ అసెంబ్లీ స్థానానికి, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్ సభ స్థానానికి నవంబర్ 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 23న ఫలితాలు వెల్లడిస్తారు.
Bye Elections to 47 Assembly Constituencies & 1 Parliamentary Constituency (Wayanad) in Kerala on 13th Nov
Bye Polls to 1 Assembly Constituency in Uttarakhand on 20th Nov
Bye Elections to 1 Parliamentary Constituency (Nanded) in Maharashtra on 20th Nov
Counting on 23rd Nov pic.twitter.com/NCxkneYL4X
— ANI (@ANI) October 15, 2024
Also Read..
Elections | మోగిన ఎన్నికల నగారా.. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్ ఇదే
Sreenath Bhasi | హిట్ అండ్ రన్ కేసు.. ప్రముఖ నటుడు అరెస్ట్
High tension wire | రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్ విద్యుత్ వైర్లు.. తప్పిన ఘోర రైలు ప్రమాదం