High tension wire | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలో ఓ రైలుకు పెను ప్రమాదం తప్పింది (major train accident averted). ఖతిమా రైల్వే స్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై హైటెన్షన్ విద్యుత్ వైర్లు (High tension wire) తెగిపడ్డాయి. మంగళవారం తెల్లవారుజామున డెహ్రాడూన్ – తనక్‌పూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (Dehradun- Tanakpur Weekly Express).. ఆ మార్గంలో ప్రయాణించింది. అయితే ట్రాక్‌పై 15 మీటర్ల పొడవైన హైటెన్షన్ విద్యుత్ వైర్లు పడి ఉండటాన్ని గుర్తించి లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
ఘటన సమాచారం అందుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ట్రాక్‌పై ఉన్న వైర్లను తొలగించారు. అనంతరం రైలు అక్కడి నుంచి గమ్యస్థానానికి బయల్దేరి వెళ్లింది. ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ దర్యాప్తు చేపట్టింది. ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు ట్రాక్‌పై పడ్డాయా..? లేక.. ఎవరైనా రైలు ప్రమాదానికి కుట్ర పన్నారా..? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కాగా, దేశంలో రైలు (Train) ప్రమాదాలకు దారి తీసేలా కుట్రపూరిత ప్రయత్నాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రైళ్లను పట్టాలు తప్పించేందుకు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ట్రాక్‌లపై (Railway Track) గ్యాస్ సిలిండర్లు, ఇనుప పట్టీలు ఉంచుతూ రైళ్లను పట్టాలు తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం వెలుగు చూశాయి. ఆయా ఘటనల్లో రైలు ట్రాక్‌లపై వివిధ రకాల వస్తువులను అధికారులు గుర్తించారు. వీటిలో ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ట్రాక్టర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ దిమ్మెలు ఉన్నాయి.
Also Read..
Earthquake | హిమాచల్ ప్రదేశ్‌ను వణికించిన స్వల్ప భూకంపం
Yusuff Ali | లులు గ్రూప్ చైర్మన్ మంచి మనసు.. అప్పులోళ్లు గెంటేసిన మహిళను ఆదుకున్న బిలియనీర్
Predator Drones: 31 ప్రిడేటర్ డ్రోన్ల ఖరీదుకు అమెరికాతో డీల్