Joe Root : ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (Joe Root) బ్యాట్ నుంచి మరో సెంచరీ జాలువారింది. అది కూడా తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థి అయిన భారత జట్టుపై శతకంతో మురిసిపోయాడు రూట్. మాంచెస్టర్ టెస్టు(Manchester Test)లో విలువైన ఇన్నింగ్స్ ఆడిన ఈ క్లాసిక్ ఆటగాడు.. టీమిండియా మీద 12వ సారి మూడంకెల స్కోర్‌తో చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అతడు వందకు చేరువవ్వడం ఇది 38వ సారి కావడం విశేషం.
లంచ్ తర్వాత అన్షుల్ కంభోజ్ ఓవర్లో ఫైన్ లెగ్‌లో బౌండరీతో శతక సంబురం చేసుకున్నాడు రూట్. ప్రస్తుతం రూట్ భారత్‌పై శతక వీరుల జాబితాలో టాప్‌లో ఉండగా.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ (Steve Smith) 11 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. స్వదేశంలో ఇండియాపై 9 పర్యాయాలు శతకంతో రెచ్చిపోయిన రూట్.. టీమిండియా పర్యటనలో మూడుసార్లు వందతో రాణించాడు.
Test century No. 3️⃣8️⃣ for Joe Root 🙌
(via @englandcricket) #ENGvIND pic.twitter.com/15zkM4QKqW
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
ఇంగ్లండ్ తరఫున అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించిన రూట్.. మాంచెస్టర్ టెస్టులో మరో మైలురాయిని అధిగమించాడు. స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్న రూట్.. జాక్వెస్ కలిస్ (Jacques Kallis)ను దాటేశాడు. మాంచెస్టర్ టెస్టులో మూడో రోజు 32 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడీ ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా వెటరన్ 13,289 రన్స్‌తో మూడో స్థానంలో ఉండగా.. రూట్ అతడిని అధిగమించాడు.